News March 21, 2024

ఈ పైశాచిక శక్తికి అవేమీ సరిపోవడంలేదు: రాహుల్

image

కేజ్రీవాల్ అరెస్టుతో ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ‘ఈ భయపడే నియంత ప్రజాస్వామ్యానికి ఉనికి లేకుండా చేస్తున్నాడు. మీడియాతో సహా అన్ని సంస్థలను భయపెట్టడం, పార్టీలను చీల్చడం, కంపెనీల నుంచి డబ్బులు దండుకోవడం, ప్రధాన ప్రతిపక్షం అకౌంట్‌ను ఫ్రీజ్ చేయడం ఈ పైశాచిక శక్తికి సరిపోలేదు. ఇప్పుడు సీఎంలను అరెస్ట్ చేయిస్తున్నాడు. దీనంతటికీ INDIA తగిన సమాధానం చెబుతుంది’ అని ట్వీట్ చేశారు.

Similar News

News October 2, 2024

కెప్టెన్సీకి బాబర్ ఆజమ్ రాజీనామా

image

పాకిస్థాన్ క్రికెట్ టీమ్ (టీ20, ODI) కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజమ్ తప్పుకున్నారు. తన బ్యాటింగ్, పర్సనల్ గ్రోత్‌పై మరింత దృష్టి పెట్టేందుకే కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కెప్టెన్సీ వల్ల వర్క్ లోడ్ పెరిగిందని పేర్కొన్నారు. 2019లో టీ20, 2020లో ODI, టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న బాబర్ 2023 ODI WC తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. మళ్లీ 2024 టీ20 WCకి ముందు కెప్టెన్ అయ్యారు.

News October 2, 2024

నితీశ్ కుమార్ ఫిట్‌గా లేరు: ప్రశాంత్ కిశోర్

image

బిహార్ సీఎం నితీశ్ శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా లేరని పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో BJP తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి నితీశ్‌కు ఆసరా ఇస్తోందని దుయ్య‌బట్టారు. ప్ర‌జా జీవితం నుంచి త‌ర‌చుగా ఆయ‌న గౌర్హాజ‌రు, భూ స‌ర్వే, వ‌ర‌ద‌లు, స్మార్ట్ మీట‌ర్ల బిగింపు వంటి కీల‌క విష‌యాల‌పై మౌనాన్ని ప్రాతిప‌దిక‌గా చేసుకొని నితీశ్ ఆరోగ్యాన్ని అంచ‌నా వేస్తున్నట్టు పేర్కొన్నారు.

News October 2, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: అక్టోబర్ 2, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4:54 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:06 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:06 గంటలకు
అసర్: సాయంత్రం 4:24 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:04 గంటలకు
ఇష: రాత్రి 7.16 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.