News February 26, 2025
కరీంనగర్: ప్రయాగరాజ్ వెళ్లి వస్తూ చనిపోయాడు..!

కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. వీణవంక మండల కేంద్రానికి చెందిన గౌడ సంఘం సభ్యుడు నల్లగోని వీరయ్య ఇటీవల యూపీలోని ప్రయాగరాజ్‌కు వెళ్లి కుంభమేళాలో పాల్గొని శివయ్యను దర్శించుకున్నాడు. తిరిగి వాహనంలో వస్తున్న క్రమంలో మంగళవారం అర్ధరాత్రి నిజామాబాద్ పట్టణంలోకి రాగానే అతడికి హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయాడు.
Similar News
News February 26, 2025
CT: వ్యక్తిగత స్కోరులో జద్రాన్ రికార్డు

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ అదిరిపోయే ఇన్నింగ్స్‌తో దుమ్ములేపారు. 146 బంతుల్లోనే 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 177 పరుగులు చేశారు. దీంతో CTలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాటర్‌గా జద్రాన్ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకూ ఈ రికార్డు ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్‌పై ఉండేది. డకెట్ తర్వాత నాథన్ ఆస్టిల్ (145*), ఆండీ ఫ్లవర్ (145), గంగూలీ (141) ఉన్నారు.
News February 26, 2025
BREAKING: పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

CUET-PG-2025 పరీక్షల షెడ్యూల్‌ను UGC విడుదల చేసింది. మార్చి 13 నుంచి ఏప్రిల్ 1 వరకు CBT విధానంలో పరీక్షలు జరుగుతాయని తెలిపింది. 43 షిఫ్టుల్లో 90 నిమిషాల చొప్పున పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. మొత్తం 157 సబ్జెక్టులకు సంబంధించి 4.12 లక్షల మంది పరీక్షలకు హాజరవుతారని పేర్కొంది. పరీక్షల షెడ్యూల్ కోసం ఇక్కడ <
News February 26, 2025
విశాఖలో రేపు పాఠశాలలకు సెలవు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విశాఖలో అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచనల మేరకు సెలవు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అన్ని పాఠశాలల యాజమాన్యాలు విధిగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేశారు.