News March 22, 2024
డ్రగ్స్‌కు అడ్డాగా ఆంధ్రప్రదేశ్: పవన్
AP: రాష్ట్రం మాదక ద్రవ్యాలకు అడ్డాగా నిలిచిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ‘ఎక్కడ గంజాయి పట్టుబడ్డా దాని మూలాలు రాష్ట్రంలోనే ఉంటున్నాయి. విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ దొరకడం సిగ్గు చేటు. వైసీపీ సర్కార్ రాష్ట్రాన్ని డ్రగ్స్‌కు రాజధానికి మార్చింది. కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఆపరేషన్ గరుడ నిర్వహించి డ్రగ్స్ మాఫియాను అరికట్టాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News January 10, 2025
ఉపాధి హామీ పథకం బిల్లులను తొందరగా చెల్లించాలి: సీఎం
TG: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బిల్లులను తొందరగా చెల్లించాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో దాదాపు 1.26 లక్షల ఉపాధి పనులు జరిగాయని అధికారులు వివరించగా, వాటికి సంబంధించిన మొత్తం బిల్లులను చెల్లించాలని సీఎం సూచించారు. కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలయ్యే నిధులు ఎప్పటికప్పుడు గ్రామాల అభివృద్ధికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
News January 10, 2025
‘సంక్రాంతి’ ప్రయాణికులపై ఛార్జీల భారం
TG: ‘సంక్రాంతికి’ సొంతూళ్లకు వెళ్లే ఆంధ్ర, తెలంగాణ ప్రయాణికులపై TGSRTC ఛార్జీల భారం మోపింది. పండగ సందర్భంగా నడపనున్న 6,432 స్పెషల్ బస్సుల్లో 50% వరకు ఛార్జీలు పెంచుతున్నట్లు తెలిపింది. 10, 11, 12, 19, 20 తేదీల్లో మాత్రమే అదనపు ఛార్జీలు వర్తిస్తాయని పేర్కొంది. రెగ్యులర్ బస్సుల్లో ఎప్పటిలాగే సాధారణ ఛార్జీలే ఉంటాయని స్పష్టం చేసింది. అటు మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ యథావిధిగా నడుస్తుందని తెలిపింది.
News January 10, 2025
నేడు కలెక్టర్లతో సీఎం సమావేశం.. కీలక అంశాలపై చర్చ
TG: సీఎం రేవంత్ ఇవాళ మ.3 గంటలకు జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు పథకాలపై చర్చించనున్నారు. ఈనెల 26 నుంచి రైతు భరోసా పంపిణీని ప్రారంభిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.