News February 26, 2025

తమిళనాడులో చరిత్ర తిరగరాస్తాం: విజయ్

image

వచ్చే ఎన్నికల్లో తామే గెలుస్తామని సినీ నటుడు, టీవీకే చీఫ్ దళపతి విజయ్ ధీమా వ్యక్తం చేశారు. మహాబలిపురంలో టీవీకే పార్టీ మహానాడులో ఆయన మాట్లాడారు. 2026 ఎన్నికల్లో చరిత్ర తిరగరాస్తామని చెప్పారు. పెత్తందార్లు, భూస్వాములు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచి సామాన్యులకు రాజ్యాధికారం కల్పిస్తామన్నారు. త్వరలోనే పార్టీలోకి కీలక నేతల చేరికలు ఉంటాయని తెలిపారు.

Similar News

News February 26, 2025

సిగ్గులేని జీడి గింజలా రేవంత్ వ్యవహారం: KTR

image

BRS ప్రభుత్వం పనులు ఆపేయడం వల్లే SLBC ప్రమాదం జరిగిందన్న CM వ్యాఖ్యలపై KTR మండిపడ్డారు. ‘సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్నా నాకేంటి సిగ్గు అన్నదట. అలా ఉంది రేవంత్ వ్యవహారం. బాధ్యత గల CM అయితే రెస్క్యూ ఆపరేషన్‌పై దృష్టి పెట్టేవాడివి. ఎన్నికలు, ఢిల్లీ టూర్లకు తిరిగే నీకు పాలన అంటే ఏంటో తెలుసా? SLBC డిజైన్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని KCR ఎప్పుడో చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపించండి’ అని ట్వీట్ చేశారు.

News February 26, 2025

దేశ ప్రజలందరికీ కొత్త పెన్షన్ స్కీం

image

దేశ ప్రజల కోసం యూనివర్సల్ పెన్షన్ స్కీం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 60 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్ అందించేలా, నిర్మాణ కార్మికులు, గిగ్ వర్కర్లకు మేలు చేసే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత పెన్షన్ పథకాలనూ దీనిలో చేర్చే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తున్న, చేయని వారు, వ్యాపారం చేసే వారూ దీని ప్రయోజనాలు పొందేలా ప్లాన్ చేస్తోంది. త్వరలోనే దీని విధివిధానాలు ప్రకటించనున్నట్లు సమాచారం.

News February 26, 2025

నందమూరి మోక్షజ్ఞకు ప్రశాంత్ వర్మ ఝలక్?

image

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమా నుంచి ప్రశాంత్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందించేందుకు ప్రశాంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించే అవకాశాలున్నట్లు సమాచారం.

error: Content is protected !!