News February 26, 2025
రాజౌరీలో ఆర్మీ వెహికల్‌పై ఉగ్రదాడి

జమ్మూకశ్మీర్ రాజౌరీ జిల్లాలో ఉగ్రదాడి జరిగింది. నియంత్రణ రేఖ సమీపంలో టెర్రరిస్టులు ఆర్మీ వాహనంపై దాడిచేశారు. అడవిలో దాక్కున్న ముష్కరులు సుందర్‌బని సెక్టార్లోని ఫాల్ గ్రామంలో వెళ్తున్న వాహనంపై ఫైరింగ్ చేశారు. వెంటనే భారత జవాన్లు ప్రతిఘటనకు దిగారు. పారిపోయిన టెర్రరిస్టులను పట్టుకొనేందుకు ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ఆరంభించింది.
Similar News
News February 26, 2025
BIG BREAKING: పోసాని కృష్ణమురళి అరెస్ట్

TG: వైసీపీ మద్దతుదారుడు, సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలో ఆయనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో రాయచోటి పోలీసులు HYD రాయదుర్గంలోని మై హోమ్ భుజా అపార్ట్‌మెంట్‌లో ఉన్న అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏపీకి తరలిస్తున్నారు. కాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి.
News February 26, 2025
రేపు స్కూళ్లకు సెలవు

APలో MLC ఎన్నికల కారణంగా కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ఉండనుంది. గుంటూరు-కృష్ణా పట్టభద్రుల, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల, విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం టీచర్స్ MLC ఎన్నిక నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని DEOలు ఆదేశించారు. కొన్ని జిల్లాల్లో సెలవులు ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. మీకు రేపు సెలవు ఇచ్చారా? తెలంగాణలోనూ <<15581975>>సెలవు <<>>ఇచ్చారు.
News February 26, 2025
తేళ్లు, బొద్దింకలు కూడా తిన్నా: కామాక్షి భాస్కర్ల

తాను చైనాలో ఎంబీబీఎస్ చదువుకునే సమయంలో తేళ్లు, బొద్దింకలు కూడా తిన్నానని హీరోయిన్ కామాక్షి భాస్కర్ల తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లినా అక్కడి వంటకాలు ట్రై చేస్తానని చెప్పారు. ‘చైనాలో ఒకప్పుడు గ్రీనరీ ఉండేది కాదు. తినడానికి కూరగాయలు కూడా దొరికేవి కాదు. అందుకే కనిపించిన జీవుల్ని చంపి తినడం వారికి అలవాటైంది’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ‘మా ఊరి పొలిమేర’ సిరీస్ చిత్రాలతో కామాక్షి ఫేమస్ అయిన విషయం తెలిసిందే.