News February 26, 2025
సిరిసిల్ల: ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణం జరపాలి : ఎస్పీ

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా 200 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 BNSS యాక్ట్ (144 సెక్షన్) అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News February 24, 2026
అనకాపల్లి: గురుకులాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

గురుకులాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో అప్పారావు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. నర్సీపట్నం గురుకుల పాఠశాలలో బాలురు, అచ్యుతాపురంలో బాలికలకు 5వ తరగతి, 6, 7, 8వ తరగతులలో మిగులు సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 10 గురుకుల కళాశాలలో ప్రవేశాలకు ఈనెల 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చనన్నారు.
News February 24, 2026
కర్ణాటక Vs జమ్మూ.. నేటి నుంచి రంజీ ఫైనల్

ఒకవైపు ఎనిమిదిసార్లు ఛాంపియన్ కర్ణాటక.. మరోవైపు తొలిసారి ఫైనల్ చేరిన జమ్మూకశ్మీర్ నేటి నుంచి రంజీ ఫైనల్లో తలపడనున్నాయి. కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, పడిక్కల్, స్మరణ్ లాంటి బ్యాటర్లతో కర్ణాటక బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీ ఆధ్వర్యంలోని బౌలింగ్ విభాగం వారికి ఎలా అడ్డుకట్ట వేస్తుందనేది ఆసక్తికరం. J&K తొలిసారి ట్రోఫీని ముద్దాడుతుందా లేక పటిష్ఠ కర్ణాటకకు తలొగ్గుతుందా చూడాలి.
News February 24, 2026
కడప: మొదటి రోజు పరీక్షలకు 748 మంది గైర్హాజరు

కడప జిల్లాలో సోమవారం ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలకు 96శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. 62 సెంటర్లలో 17,726 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 748 మంది గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థులు 16,392 మందికి గానూ, 15,789 మంది పరీక్షలు రాశారు. ఒకేషనల్ విద్యార్థులు 1,334 మందికిగాను, 1,189 మంది పరీక్షలకు వచ్చారు.


