News February 26, 2025
ఎస్.రాయవరంలో శివరాత్రి రోజున విషాదం

ఎస్.రాయవరం మండలం పెనుగొల్లులో శివరాత్రి రోజున విషాదం నెలకొంది. శివరాత్రి సందర్భంగా బుధవారం పెనుగొల్లు గ్రామంలో పక్కుర్తి చరణ్ (20) మరో యువకుడు స్నానానికి దిగారు. వీరికి ఈత రాకపోవడంతో మునిగిపోతుండగా ఒక యువకుడిని రక్షించారు. అప్పటికే మునిగిపోయిన చరణ్‌ను బయటికి తీయగా అపస్మారక స్థితికి చేరుకున్నాడు. హుటాహుటిన నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
Similar News
News February 27, 2025
ప్రకాశం జిల్లాలో స్వయంగా గస్తీ చేపట్టిన SP

త్రిపురాంతకంలోని శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి దేవస్థానం, శ్రీమత్ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానాల వద్ద భద్రతా ఏర్పాట్లను ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ బుధవారం రాత్రి పరిశీలించారు. ఉత్సవాల సమయంలో దొంగతనాలు, అసాంఘీక కార్యకలాపాలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచాలని అన్నారు. అలాగే తిరునాళ్ల సందర్భంగా ఎక్కడా ఇబ్బందులు లేకుండా వేడుకలు జరిగేలా చూడాలని సిబ్బందికి సూచించారు.
News February 26, 2025
రాజంపేటకు పోసాని కృష్ణమురళి తరలింపు

AP: సినీనటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అన్నమయ్య జిల్లా రాజంపేటకు తరలిస్తున్నారు. రేపు రాజంపేట అడిషనల్ మెజిస్ట్రేట్ ఎదుట ఆయనను హాజరుపరచనున్నారు. YCP హయాంలో FDC ఛైర్మన్ హోదాలో పోసాని TDP నేతలను అసభ్యంగా దూషించారని రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్3(5) కింద కేసులు నమోదయ్యాయి. కులాల పేరుతో దూషించారని, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
News February 26, 2025
NZB: శివాలయానికి వెళ్లొచ్చే సరికి మూడిళ్లలో చోరీ

శివరాత్రికి దేవాలయాలకు వెళ్లి వచ్చే సరికి అగంతకులు తాళం వేసిన మూడిళ్లలో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డారు. గంగస్థాన్ నుంచి కేశాపూర్ వెళ్ళేదారిలో రియల్టర్ బలరాం రెడ్డి ఇంట్లో 25 తులాల బంగారం, ఆర్టీసీ కాలనీలోని రవీందర్ ఇంట్లో 2 తులాల బంగారం, ఏక శిలా నగర్‌లోని పెద్దమ్మ గుడి సమీపంలోని కిరాణ వ్యాపారి రవీందర్ ఇంట్లో రూ.60 వేల నగదును అపహరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.