News February 26, 2025
ADB: రేపు ప్రభుత్వ విద్యాసంస్థలకు సెలవు

మెదక్ – నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ & టీచర్స్ ఎన్నికలను దృష్ట్యా ఆదిలాబాద్‌లో గురువారం పోలింగ్ కేంద్రాలున్న ప్రభుత్వ విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. కావున జిల్లా విద్యాశాఖాధికారి, ఆదిలాబాద్, సంబంధిత జిల్లా స్థాయి అధికారులందరూ తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News February 27, 2025
ఆదిలాబాద్: 39 పోలింగ్ కేంద్రాలు.. 16,528 ఓటర్లు

ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 39 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జరిగిందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 11,418 మంది పురుషులు, 5,110 మంది మహిళలు, మొత్తం 16,528 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు కేంద్రాల్లో సీసీ కెమెరాలు, తాగునీరు, విద్యుత్, టాయిలెట్స్, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. ★ఉదయం 8 నుండి 4 వరకు పోలింగ్.
News February 27, 2025
ఎన్నికలకు 400 మందితో బందోబస్తు: ADB SP

నేడు జరగబోయే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా జిల్లావ్యాప్తంగా 400 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ADB జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక టీటీడీసీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఏర్పాట్లను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
News February 26, 2025
ADB జిల్లాలో 31 ఇంటర్ పరీక్ష కేంద్రాలు: కలెక్టర్

ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు మొత్తం 18,880 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ఎస్ఈకి సూచించారు. నిర్ణీత సమయానికి సకాలంలో ప్రశ్నపత్రాలు కేంద్రాలకు చేర్చాలన్నారు.