News February 26, 2025

ఉత్త‌రాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సర్వం సిద్ధం

image

ఉత్త‌రాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. జిల్లా ఎన్నిక‌ల అధికారి డాక్ట‌ర్ బీఆర్.అంబేడ్కర్ ఆదేశాల‌కు అనుగుణంగా రెవెన్యూ అధికారులు ఎన్నిక‌కు అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌ను పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 5,223 మంది ఉపాధ్యాయులు త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 3,270 మంది పురుషులు కాగా, 1,953 మంది మ‌హిళా ఓట‌ర్లు ఉన్నారు.

Similar News

News February 26, 2025

విజయనగరం జిల్లాలో రేపు అన్ని పాఠశాలలకు సెలవు

image

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా విజయనగరం జిల్లాలో గల అన్ని యాజమాన్య పరిధిలోని ఉన్నత పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు DEO యు.మాణిక్యం నాయుడు బుధవారం తెలిపారు. ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలో గల అన్ని ఉన్నత పాఠశాలలు సెలవు ఇచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 29 పాఠశాలల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నట్లు ఆయన చెప్పారు.

News February 26, 2025

విశాఖలో మర్డర్ చేసిన విజయనగరం వ్యక్తి

image

విజయనగరం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి విశాఖలో దారుణ హత్య చేశాడు. రామతీర్థానికి చెందిన వై.శ్రీను, విశాఖలోని రామ్‌నగర్‌కు చెందిన ఆనంద్ ఇద్దరూ కలిసి సోమవారం రాత్రి వెంకోజిపాలెం వద్ద మద్యం తాగారు. ఈక్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. భయపడి ఆనంద్‌ పారిపోగా.. శ్రీను వెంటపడి మరీ రాయితో కొట్టి చంపేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News February 26, 2025

VZM: పెళ్లి పేరుతో మోసం.. 20ఏళ్లు జైలు శిక్ష..!

image

పెదమానాపురంలో 2023లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.4వేలు జరిమానా విధించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పెదమానాపురానికి చెందిన మారోతు వెంకటేశ్ (25) ఓ బాలికను పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి నాగమణి తీర్పు వెల్లడించినట్లుగా ఎస్పీ పేర్కొన్నారు. 

error: Content is protected !!