News March 22, 2024
కామారెడ్డి: అనుమతులు లేని డబ్బు, మద్యం పట్టివేత

జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ వెలువడిన నాటి నుంచి జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. గత 3 రోజుల్లో రూ.7.6 లక్షలు, నేడు రూ.4.50 లక్షల నగదుతో పాటు 986 లీటర్ల మద్యం పట్టుకున్నట్లు వెల్లడించారు. అధికారులు సమిష్టిగా కృషిచేస్తూ అక్రమ డబ్బు, మద్యం రవాణాను అరికట్టాలని ఆమె సూచించారు.
Similar News
News February 24, 2025
నిజామాబాద్: రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత KCRకు లేదు: TPCC చీఫ్

విజన్ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత ఫామ్ హౌస్‌లో పడుకునే KCRకు లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తాను పరిగెత్తుతూ మంత్రులను పరిగెత్తిస్తున్నారని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ధైర్యం ముఖ్యమని, ఆ ధైర్యం రేవంత్ రెడ్డికి గుండె నిండా ఉందని పేర్కొన్నారు.
News February 24, 2025
NZB: BRSకు పోటీ చేసేందుకు అభ్యర్థి లేడు: CM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్‌కు అభ్యర్థి దొరకలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. సోమవారం నిజామాబాద్‌లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటూ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. కనీసం ఎన్నికల్లో పోటీకి అభ్యర్థి లేని ఆ పార్టీ తమ ప్రభుత్వాన్ని ఏ విధంగా పడగొడుతుందో ఆలోచించుకోవాలన్నారు.
News February 24, 2025
NZB: వార్షిక పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు: అదనపు కలెక్టర్

పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు, పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు జరుగుతాయని వెల్లడించారు.