News February 26, 2025
జగిత్యాల: ఎమ్మెల్సీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్

జగిత్యాల పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియంలో ఏర్పాటుచేసిన ఎమ్మెల్సీ ఎన్నికలు డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్‌ను, ఏర్పాట్లను కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం పరిశీలించారు. రూట్ బస్సులను పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఎస్పీ అశోక్ కుమార్, ఆర్డీవోలు తదితర అధికారులు ఉన్నారు.
Similar News
News September 15, 2025
ములుగు: ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా సీతక్క

ఈనెల 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల నేపథ్యంలో ములుగు జిల్లాలో జరిగే కార్యక్రమానికి మంత్రి సీతక్కను ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. అతిధి చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించడం, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించడం జరుగుతుంది.
News September 15, 2025
ములుగు గ్రీవెన్స్‌లో 71 దరఖాస్తులు

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ములుగు అదనపు కలెక్టర్(స్థానిక సంస్థల) సంపత్ రావు వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వేకరించారు. మొత్తం 71 దరఖాస్తులు రాగా.. అందులో 26 రెవిన్యూ, 6 ఇందిరమ్మ ఇళ్లు, 7 పెన్షన్, 6 ఉద్యోగం, 26 ఇతర సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి.
News September 15, 2025
గుంటూరు: DSC-2025 రిక్రూట్మెంట్ జాబితా చెక్ చేస్కోండి

గుంటూరు జిల్లాలో మెగా డీఎస్సీ-2025 కి సంబంధించిన అన్ని కేటగిరీల రిక్రూట్‌మెంట్ జాబితాను deognt.blogspot.com వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఈవో సి.వి. రేణుక తెలిపారు. ఈ జాబితాను డీఈవో కార్యాలయం, కలెక్టరేట్‌లోని డిస్‌ప్లే బోర్డుల్లో కూడా ప్రదర్శిస్తామని ఆమె చెప్పారు. అదనపు సమాచారం కోసం డీఈవో కార్యాలయంలోని సహాయక కేంద్రాన్ని సంప్రదించాలని ఆమె సూచించారు.