News February 26, 2025

GWL: ఫేక్ సర్టిఫికెట్ల సూత్రధారి అరెస్ట్.!

image

ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారంలో ప్రధాన సూత్రధారి మిర్యాలగూడకు చెందిన రిటైర్డ్ ప్రిన్సిపల్ బాలకృష్ణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు గద్వాల డీఎస్పీ మొగిలయ్య తెలిపారు. బుధవారం టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లా వ్యవసాయ శాఖలో ఏఈవోలుగా ఫేక్ సర్టిఫికెట్లతో కొంతమంది పని చేశారని వారితో పాటు సర్టిఫికెట్ల సూత్రధారిని అరెస్టు చేశామని తెలిపారు.

Similar News

News November 17, 2025

జగిత్యాల: శీతాకాలం.. జిల్లావాసులకు SP సూచనలు

image

శీతాకాలం మొదలైనందున రహదారులపై పొగమంచు ఎక్కువగా ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వాహనదారులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు.
1. వేగం తగ్గించాలి
2. ఫాగ్‌లైట్లు- లో బీమ్ ఉపయోగించాలి
3. ముందున్న వాహనానికి దూరం పాటించాలి
4. ఓవర్‌టేక్ చేయరాదు
5. రోడ్డుపై వాహనాలు నిలపకూడదు
6. హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి అని SP కోరారు.

News November 17, 2025

సినిమావాళ్ల కంటే మిరే నష్టపోతున్నారు: రాజమౌళి

image

పోలీసులకు సవాల్ చేసి.. భస్మాసుర హస్తంలా ఇమ్మడి రవి తన తల మీద తానే చెయ్యి పెట్టుకున్నాడని, ఏదీ ఊరికే రాదని దర్శకుడు రాజమౌళి అన్నారు. ఐ బొమ్మలో ఫ్రీగా మూవీలు ఎలా వస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించారా? మీ పర్సనల్ డేటా ఇమ్మడి రవి అమ్ముకుంటున్నాడు. అంత పెద్ద సర్వర్లు మెయింటెన్ చేయాలంటే ఎంతో డబ్బు కావాలి. ఆ డబ్బంతా మీరే ఇస్తున్నారు. మా సినిమా వాళ్లకంటే.. మీరే ఎక్కువగా నష్టపోతున్నారన్నారు.

News November 17, 2025

వరంగల్ కమిషనరేట్ పరిధిలో 118 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

image

మందు బాబులు వాహనాలు నడపడం కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 118 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ పరిధిలోనే 60 కేసులు ఉన్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, వాహనం సీజ్ చేసి కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు వాహనదారులను హెచ్చరించారు.