News February 26, 2025

కోనసీమ మోనాలిసా అంటూ పోస్టింగ్.. కేసు నమోదు

image

మైనర్ బాలికపై ఇంస్టాగ్రామ్‌లో పోస్టింగ్ పెట్టి ఆమెను మనస్తాపానికి గురిచేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ జ్వాలాసాగర్ బుధవారం తెలిపారు. సిహెచ్ గున్నేపల్లి సత్తెమ్మ తల్లి తీర్థంలో అమలాపురానికి చెందిన మైనర్ బాలిక పూసలు అమ్ముకుంటుందన్నారు. అమలాపురం చింతాడ గరువుకు చెందిన దేవిశ్రీప్రసాద్ వీడియోలు తీసి ఇంస్టాగ్రామ్‌లో కోనసీమ మోనాలిసా అంటూ పోస్టింగ్ చేశాడన్నారు. దీనిపై బాలిక పినతల్లి ఫిర్యాదు చేశారు.

Similar News

News January 13, 2026

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

image

గర్భిణిగా ఉన్నప్పుడు బ్లీడింగ్‌/స్పాటింగ్‌ కనిపిస్తే డాక్టర్‌ సూచించిన మందులు వాడడంతో పాటు వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈ సమయంలో కలయికలో పాల్గొనడం మంచిది కాదు. శ్యానిటరీ న్యాప్ కిన్స్ వాడాలి. వ్యాయామాలు చేసే అలవాటుంటే వైద్యుల సలహాతో వ్యాయామాలు చెయ్యాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రెగ్నెన్సీలో వచ్చే వివిధ కాంప్లికేషన్లు తగ్గించొచ్చని నిపుణులు చెబుతున్నారు.

News January 13, 2026

తిరుపతి: భార్య పోలీస్.. భర్త దొంగ!

image

నెల్లూరులో కార్ల <<18838353>>దొంగతనం <<>>వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తిరుపతిలోని ఓ కారు షోరూమ్‌లో పనిచేసే లక్ష్మణ్ కుమార్, కారు మెకానిక్ శివ(నెల్లూరు బీవీనగర్‌), A1 నిందితుడు ఫ్రెండ్స్. ఢిల్లీ, ముంబయిలో A1 కార్లు చోరీ చేసి నెల్లూరుకు తెస్తే ఈ ఇద్దరూ AP, TS నంబర్ ప్లేట్లు మార్చి తక్కువ రేటుకు అమ్మేస్తున్నారు. A1 నెల్లూరుకు చెందిన ఓ లేడీ కానిస్టేబుల్ భర్త అని.. అతనిపై చాలా కేసులు ఉన్నట్లు సమాచారం.

News January 13, 2026

ఎస్సీ కార్పొరేషన్ రుణగ్రహీతలకు ఊరట: కలెక్టర్

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు రుణమాఫీ వర్తిస్తుందని జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. 2015 నుంచి 2019 వరకు NSFDC, NS KFDC పథకాల కింద స్వయంఉపాధి కోసం రుణాలు పొందిన లబ్ధిదారులకు వడ్డీ మాఫీకి ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. ఏడాది ఏప్రిల్ 30వ తేదీ లోపు మొత్తం చెల్లించిన వారికి వడ్డీ మాఫీ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని చెప్పారు.