News March 22, 2024

కాన్పులు చేయని ఆరోగ్య కేంద్రాలపై చర్యలు: డీఎంహెచ్‌వో

image

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ యం.సుహాసిని గంపలగూడెంలోని చౌటపల్లి, ఊటుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను గురువారం సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాన్పులు నిర్వహణ తీరు, లక్ష్యాల సాధనకు తీసుకోవలసిన చర్యలపై ఆదేశాలు ఇచ్చారు. పి.హెచ్.సిలో వివిధ ఆరోగ్య కార్యక్రమాలు అమలు తీరు పర్యవేక్షించారు. పీహెచ్సీలో కాన్పులు చేయని వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Similar News

News January 12, 2025

కృష్ణా: భోగి మంట వేస్తున్నారా..?

image

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీ సెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ నంబర్ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.

News January 12, 2025

కృష్ణా: భోగి మంట వేస్తున్నారా?

image

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.

News January 12, 2025

వివాదంలో MLA కొలికపూడి.. వివరణ కోరిన సీఎం 

image

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఏ.కొండూరు మండలం గోపాలపురంలో అన్నదమ్ముల స్థల పంచాయితీ పరిష్కారానికి ఎమ్మెల్యే వెళ్లారు. అక్కడ 5వ వార్డు సభ్యురాలు భూక్యా చంటి ఇంట్లోకి వెళ్లి తిట్టి, కొట్టారని శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన ఎమ్మెల్యే నుంచి వివరణ కోరినట్లు తాజాగా సమాచారం వెలువడింది.