News February 26, 2025
ఎమ్మెల్సీ ఓటర్లకు సిద్దిపేట సీపీ సూచనలు

పట్టబద్రులు, టీచర్లు పోలీసుల సలహాలు, సూచనలు పాటించి ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించాలని సిద్ధిపేట పోలీస్ కమిషనర్ అనురాధ కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించామని, కావున గుంపులు గుంపులుగా తిరగవద్దని సీపీ సూచించారు.
Similar News
News July 6, 2025
PLEASE CHECK.. ఇందులో మీ పేరు ఉందా?

AP: అన్నదాతా సుఖీభవ పథకానికి తాము అర్హులమో? కాదో? తెలుసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. https://annadathasukhibhava.ap.gov.in/లో చెక్ స్టేటస్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేస్తే రైతులకు తాము అర్హులమో కాదో అన్న వివరాలు తెలుస్తాయి. ఎందుకు <<16960279>>అనర్హత <<>>ఉందో కూడా కారణం తెలుసుకోవచ్చు. మీరు అర్హులో కాదో తెలుసుకునేందుకు ఇక్కడ <
News July 6, 2025
నిర్మల్ జిల్లాకు భారీ వర్ష సూచన

నిర్మల్ జిల్లాలో ఈనెల 6 నుంచి 9 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈనేపథ్యంలో జిల్లాకు పింక్ అలర్ట్ జారీ చేశారు. నిర్మల్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలు ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని తెలిపారు.
News July 6, 2025
‘విశాఖ కేంద్ర కారాగారంలో రూ.10 కోట్లతో కొత్త బ్యారక్’

ఏపీలో ఉన్న వివిధ జైళ్లను రూ.103 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు జైళ్ల శాఖ ఐజీ డా.ఇండ్ల శ్రీనివాస్ తెలిపారు. దీనికి సంబంధించి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ సిద్ధం చేసిన డిజైన్‌ను అప్రూవల్ కోసం ప్రభుత్వానికి పంపించామన్నారు. విశాఖ సెంట్రల్ జైల్లో రూ.10 కోట్లతో 250 మంది సామర్థ్యం గల కొత్త బ్యారక్ నిర్మాణం జరుగుతుందన్నారు. విశాఖ జైలుని సందర్శించిన ఆయన ఈ మేరకు వివరాలు తెలియజేశారు.