News February 26, 2025

బెజవాడ దుర్గమ్మకు మంగళగిరి చేనేత పట్టు వస్త్రాలు

image

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బెజవాడ దుర్గమ్మకు మంగళగిరి భక్త మార్కండేయ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం చేనేత పట్టు వస్త్రాలను బహూకరించారు. ప్రతిఏటా ఆనవాయితీగా సారెను సమర్పిస్తున్నారు. ప్రధాన కైంకర్యపరులుగా ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులు చిల్లపల్లి శ్రీనివాసరావు, గౌరీ, గుత్తికొండ ధనుంజయరావు,విజయ దంపతులు వ్యవహరించారు. ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి రత్నరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

Similar News

News February 27, 2025

గుంటూరు: ఎమ్మెల్సీ ఎలక్షన్‌కు సర్వం సిద్ధం

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 149 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 1,08,109మంది ఓటర్లు ఓటు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు. వీరిలో పురుషులు 62,549, మహిళలు 45,542, ఇతరులు 18మంది ఉన్నారు. గ్రాడ్యుయేట్లు అందరూ తప్పనిసరిగా ఓటు హక్కును ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News February 26, 2025

గుంటూరు జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు: DEO

image

గుంటూరు-కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 27న గురువారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అన్నింటికీ సెలవు ప్రకటిస్తున్నట్లు గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ రేణుక తెలిపారు. ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలల యాజమాన్యాలకు తెలియజేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 26, 2025

తాడేపల్లి: వరుడికి HIV.. నిలిచిపోయిన పెళ్లి  

image

తాళి కట్టే సమయంలో వివాహం నిలిచిపోయిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. తాడేపల్లిలోని ఓ చర్చిలో క్రైస్తవ పద్ధతిలో వివాహ కార్యక్రమం జరుగుతున్న సమయంలో HIV డిస్టిక్ ప్రాజెక్టు మహిళా ప్రతినిధులు చర్చి పాస్టర్‌కు వరుడికి HIV ఉందని తెలిపారు. దీంతో పాస్టర్ పెళ్లిని నిలిపివేశారు. అనంతరం వరుడి బంధువులు వధువు బంధువులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులకు రంగప్రవేశంతో వివాదం సద్దుమణిగింది. 

error: Content is protected !!