News February 26, 2025

సూర్యాపేట: సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ

image

NLG, KMM, WGL శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సూర్యాపేట జిల్లా సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ బుధవారం సందర్శించారు. సూర్యాపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరుతెన్నులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Similar News

News November 9, 2025

పల్నాడు యుద్ధం ఎక్కడ జరిగిందో తెలుసా..!

image

మినీ మహాభారతం, ఆంధ్ర కురుక్షేత్రంగా చరిత్రకెక్కించిన పల్నాడు యుద్ధం జరిగిన ప్రాంతం ఎక్కడో తెలుసా? పల్నాడు జిల్లా కారంపూడిలోని నాగులేరు వాగు ఒడ్డునే ఆ చారిత్రక ఘట్టం జరిగింది. యుద్ధంలో రక్తపుటేరులు ప్రవహించినట్లు చరిత్రకారులు చెబుతారు. వీరుల త్యాగాలను స్మరించుకుంటూ, అప్పటి ఆయుధాలను పూజిస్తూ ఇక్కడ వీరుల గుడిని నిర్మించారు. ప్రతి ఏటా ఇక్కడ ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం.

News November 9, 2025

ఏలూరు జిల్లాలో పోలీసుల తనిఖీలు

image

ఏలూరు జిల్లాలోని జాతీయ రహదారులపై శనివారం రాత్రి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రమాదాల నివారణలో భాగంగా హెవీ వాహన డ్రైవర్లకు ‘ఫేస్ వాష్’ కార్యక్రమం నిర్వహించారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్‌లతో పరీక్షలు నిర్వహించారు. రాత్రివేళల్లో లాడ్జీలు, బస్సు, రైల్వే స్టేషన్లలో కొత్త వ్యక్తుల వివరాలను ఆరా తీసి, అనుమానాస్పదంగా ఉన్న వారిని ప్రశ్నించారు.

News November 9, 2025

జెమీమా, షెఫాలీ.. భారీగా పెరిగిన బ్రాండ్ వాల్యూ

image

ఉమెన్స్ ODIWC విజయం తర్వాత జెమీమా, షెఫాలీ బ్రాండ్ వాల్యూ 2-3 రెట్లు పెరిగినట్లు కార్పొరేట్ వర్గాలు చెబుతున్నాయి. ‘జెమీమా ₹60 లక్షల నుంచి ₹1.5 కోట్లు, షెఫాలీ ₹40 లక్షల నుంచి ₹కోటి కేటగిరీకి చేరారు. మిగతా ప్లేయర్లకూ 25-55% పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. లైఫ్ స్టైల్, బ్యూటీ, పర్సనల్ కేర్, విద్యాసంస్థలు, ఆటోమొబైల్, బ్యాంకులు వారితో ప్రచారం చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి’ అని పేర్కొన్నాయి.