News February 26, 2025

విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలు ఇవే

image

ఉత్తరాంధ్ర టీచర్ MLC ఎన్నికలకు 13 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పెద్ద గంట్యాడ జడ్పీ స్కూల్, గాజువాక జడ్పీ స్కూల్, పెందుర్తి గవర్నమెంట్ స్కూల్, చిన్న వాల్తేర్ ఏయూ స్కూల్, డాబాగార్డెన్స్ ప్రేమా స్కూల్, న్యూస్ కాలనీ హైస్కూల్, కంచరపాలెం పాలిటెక్నిక్, మల్కాపూరం జీవీఎంసీ స్కూల్, గోపాలపట్నం జడ్పీ స్కూల్, మధురవాడ జడ్ప స్కూల్, పద్మనాభం ఎంపీపీ స్కూల్, ఆనందపురం స్కూల్, భీమిలి మహాత్మా గాంధీ స్కూల్.

Similar News

News February 27, 2025

విశాఖ మహా కుంభాభిషేకంలో పాల్గొన్న బ్రహ్మానందం

image

విశాఖ ఆర్కే బీచ్‌లో మాజీ కేంద్ర మంత్రి సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు బ్రహ్మానందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ హైందవ ధర్మంను కాపాడుకోవడాన్ని తమ భాద్యతగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతోపాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

News February 27, 2025

విశాఖ మీదుగా నడిచే పలు రైళ్లు రీ షెడ్యూల్

image

విశాఖ మీదుగా నడిచే పలు రైళ్లను నేడు రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి 22:45 గంటలకు బయలుదేరాల్సిన హౌరా – SMV బెంగుళూరు SF ఎక్స్‌ప్రెస్ గురువారం తెల్లవారుజామున 2 గంటలకు హౌరాలో బయలుదేరనుంది. సికింద్రాబాద్ – విశాఖ గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ ఈరోజు రాత్రి గంట ఆలస్యంగా 9.30 గంటలకు విశాఖలో బయలుదేరనుంది. ప్రయాణీకులు గమనించాలని కోరారు.

News February 26, 2025

విశాఖ జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

➤ విశాఖ జిల్లా వ్యాప్తంగా మార్మోగిన శివనామస్మరణ
➤ రేపు 13 కేంద్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
➤ జిల్లా వ్యాప్తంగా రేపు అన్ని పాఠశాలలకు సెలవు
➤ త్వరలో విశాఖ మెట్రో పనులు ప్రారంభం?
➤ మల్కాపురానికి చెందిన 22 ఏళ్ల యువకుడు మృతి
➤ ఆర్.కే, అప్పికొండ, భీమిలి బీచ్‌లలో పుణ్యస్నానాలకు ఏర్పాట్లు చేసిన అధికారులు

error: Content is protected !!