News February 26, 2025

కాకినాడ: 8 మంది ఓపీఓలు సస్పెండ్- కలెక్టర్

image

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విధులకు హాజరుకాని 8 మంది ఓపీఓలను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు కాకినాడ కలెక్టర్ షామ్మోహన్ తెలిపారు. కాకినాడ డివిజన్‌లో ముగ్గురు, పెద్దాపురం డివిజన్‌లో ఐదుగురు బుధవారం పోలింగ్ సామగ్రి తీసుకువెళ్లే కార్యక్రమానికి హాజరు కాలేదున్నారు. దీంతో వారిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇద్దరు మైక్రో అబ్జర్వర్లు విధులకు హాజరు కాకపోవడంతో వారిపై చర్యలకు ఆదేశాలు ఇచ్చామన్నారు.

Similar News

News February 27, 2026

GREAT.. ‘ఆర్ఎంసీ’లో భూపాలపల్లి సౌమ్య ప్రతిభ

image

రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్ఎంసీ) ప్రవేశ పరీక్షలో జయకేతనం ఎగరేసి భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం బౌసింగ్ పల్లికి చెందిన చిందం సౌమ్య సత్తా చాటారు. దక్షిణ భారతదేశం నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక బాలికగా ఆమె రికార్డు సృష్టించారు. భవిష్యత్తులో ఆర్మీలో ఉన్నత అధికారిణిగా సేవలు అందించడమే తన లక్ష్యమని సౌమ్య పేర్కొన్నారు. ఈ విజయంపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News February 27, 2026

నెల్లూరు: కిడ్నాప్.. తల లేకుండా డెడ్‌బాడీ లభ్యం

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో యువకుడి మృతి కలకలం రేపింది. ముస్లిం వీధికి చెందిన ఉస్మాన్ ఓ హిజ్రాతో సన్నిహితంగా ఉండేవాడు. ఆమెకు చెందిన కొంత బంగారాన్ని అతని అన్న హుస్సేన్(33) తాకట్టు పెట్టి నగదు వాడుకున్నాడు. దీంతో ఆ హిజ్రా మరికొందరితో వచ్చి హుస్సేన్‌ను ఆటోలో తీసుకెళ్లి కిడ్నాప్ చేసింది. ఏమైందో ఏమో గురువారం పండ్లూరు వద్ద రైల్వే పట్టాలపై తల లేని మొండెంగా హుస్సేన్ డెడ్‌బాడీ దొరికింది.

News February 27, 2026

గ్రేటర్ వరంగల్‌లో తగ్గిన ఆదాయం!

image

గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరగడం వల్ల కార్పొరేషన్‌కు వివిధ ఫీజుల రూపంలో వచ్చే భవన నిర్మాణాల అనుమతుల ఆదాయం తగ్గుతోంది. 2024-25లో రూ.52 కోట్ల ఆదాయం వచ్చింది. 2025-26 బడ్జెట్లో భవన నిర్మాణ అనుమతుల ద్వారా రూ.136.05 కోట్లు ఆదాయం పొందాలని అంచనా వేయగా, ఇప్పటి వరకు రూ.22 కోట్లు మాత్రమే వచ్చింది. ఆదాయం తగ్గడానికి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించడమే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి