News February 26, 2025

అల్లూరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రేపు(గురువారం) పాడేరు డివిజన్లో అన్ని విద్యా సంస్థలకు స్థానిక సెలవుగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. అలాగే రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలో పోలింగ్ కేంద్రాలు కేటాయించిన భవనాలు ఉన్న సంస్థలకు సెలవు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అన్ని యాజమాన్య పాఠశాలలు ఆదేశాలు పాటించాలని సూచించారు. 

Similar News

News September 17, 2025

తిరుపతి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు

image

మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా చిల్డ్రన్ హోమ్స్, వివిధ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం పేర్కొంది. శ్రీకాళహస్తిలో 7, కోటలో 2, SAA యూనిట్‌లో 5, DCPU యూనిట్‌లో ఓ పోస్టుతో పాటు మొత్తం 15 ఖాళీలు ఉన్నాయి. కేవలం మహిళలే అర్హులు. ఇతర వివరాలకు https://tirupati.ap.gov.in/ వెబ్‌సైట్ చూడగలరు. చివరి తేదీ సెప్టెంబర్ 19.

News September 17, 2025

సంచలన తీర్పులకు కేరాఫ్.. నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు

image

నల్గొండ పోక్సో కేసుల ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పులకు కేరాఫ్‌గా నిలుస్తోంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి N.రోజారమణి తన తీర్పులతో తప్పు చేయాలనుకునే వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జులై 4 నుంచి ఈ నెల 16 వరకు పది పోక్సో కేసుల్లో తీర్పులిచ్చారు. వీటిలో ఒక కేసులో దోషికి ఉరి శిక్ష, మిగిలిన కేసుల్లో కనీసం 20 ఏళ్లకు తగ్గకుండా శిక్షలు విధించారు.

News September 17, 2025

HYDలో గోల్డ్ షాపు యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు

image

తెల్లవారుజామునుంచే HYDలోని ప్రముఖ గోల్డ్ షాపు యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు చేస్తోంది. ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకల నేపథ్యంలో ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. వరంగల్లోనూ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.