News February 26, 2025
కాళేశ్వరంలో పూజలు చేసిన మాజీ మంత్రి

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. వీరు ఆలయం వద్దకు రాగా ఆలయ అర్చకులు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. ఆలయంలోకి వెళ్లి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆలయంలో దర్శించుకున్నాక ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేశారు. మీరు వెంట మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, నాయకులు రాకేశ్ తదితరులు ఉన్నారు.
Similar News
News February 27, 2025
అంతర్జాతీయ సదస్సులో సిద్దిపేట ప్రొఫెసర్‌కు ప్రశంసా పత్రం

ఈనెల 24, 25న నేపాల్ రాజధాని కాట్మండ్‌లో బయోటెక్నాలజీ సొసైటీ ఆఫ్ నేపాల్ ఆధ్వర్యంలో జరిగిన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సులో వివిధ దేశాల నుంచి పరిశోధకులు పరిశోధనా పత్రాలను ప్రవేశపెట్టారు. జంపన్న వాగు నీటి నాణ్యత పైన చేసిన పరిశోధన పత్రాన్ని ప్రవేశపెట్టిన సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల సూక్ష్మ జీవశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మదన్ మోహన్‌కు అంతర్జాతీయ సదస్సులో ప్రశంస పత్రాన్ని అందజేశారు.
News February 27, 2025
శ్రీశైలంలో కనుల పండువగా మల్లికార్జునుడి కళ్యాణం

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జునుడి కళ్యాణం కనుల పండువగా సాగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, వేలాదిగా తరలివచ్చిన భక్తుల శివనామ స్మరణ, మంగళవాయిద్యాల మధ్య ఆ మల్లికార్జునుడు బ్రమరాంభ అమ్మవారి మెడలో మూడుముళ్లు వేశారు. అనంతరం పండితులు స్వామి, అమ్మవార్లకు ముత్యాల తలంబ్రాలు పోశారు. ఈ వేడుకను చూసి భక్తులు తరించారు.
News February 27, 2025
వరంగల్: బాలాజీనగర్లో గోమాతకు శ్రీమంతం

గోమాతకు శ్రీమంతం నిర్వహించిన ఘటన వరంగల్ నగరంలోని కాశీబుగ్గ ఎనుమాముల రోడ్డులోని బాలాజీ నగర్‌లో బుధవారం జరిగింది. శ్రీకైలాస ఈశ్వర ప్రభక్త ఆంజనేయస్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోమాతకు శ్రీమంతం పూజా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని గోశాలలో ఉన్న వకలా మాత గోవు గర్భం దాల్చగా ఆలయ భక్తులు ఈ కార్యక్రమం చేపట్టారు. స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.