News February 26, 2025

రేపు స్కూళ్లకు సెలవు

image

APలో MLC ఎన్నికల కారణంగా కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ఉండనుంది. గుంటూరు-కృష్ణా పట్టభద్రుల, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల, విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం టీచర్స్ MLC ఎన్నిక నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని DEOలు ఆదేశించారు. కొన్ని జిల్లాల్లో సెలవులు ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. మీకు రేపు సెలవు ఇచ్చారా? తెలంగాణలోనూ <<15581975>>సెలవు <<>>ఇచ్చారు.

Similar News

News January 11, 2026

NSUTలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

ఢిల్లీలోని నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (NSUT)లో 31 టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు జనవరి 19 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని ఫిబ్రవరి 3వరకు పంపాలి. BE/BTech/BS/ME/MTech/MS, M.Arch, MBA/PGDM/CA/ICWA/M.Com, PhD ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు గరిష్ఠ వయసు 35ఏళ్లు కాగా.. అసోసియేట్ ప్రొఫెసర్‌కు 50ఏళ్లు. సైట్: https://nsut.ac.in

News January 11, 2026

సినిమా టికెట్ల రేట్లపై కమీషన్ల దందా: హరీశ్ రావు

image

TG: ఎన్నికల్లో ఓడిపోయి రాజ్యాంగేతర శక్తిగా ఎదిగిన ఓ వ్యక్తి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్నారని, కమీషన్ల రూపంలో రూ.కోట్లు వసూలు చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఆ వివరాలను త్వరలో బయటపెడతామన్నారు. ఈ కమీషన్ల దందాపై గవర్నర్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‘ఓవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో ఇస్తారు. మరోవైపు సినిమాటోగ్రఫీ మంత్రేమో తనకు తెలియదంటారు. ఇదేం పాలన’ అంటూ CM రేవంత్, ప్రభుత్వంపై ఫైరయ్యారు.

News January 11, 2026

చెరకు సాగు-విత్తనం ఎంపికలో జాగ్రత్తలు

image

చీడపీడలు, తెగుళ్లు ఆశించని ఆరోగ్యకరమైన, నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. చెరకు గడపైన ఉన్న మూడోవంతు లేత భాగాన్ని మాత్రమే విత్తనంగా ఉపయోగించాలి. గడలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు మాత్రమే, విత్తనం నుంచి మొలక శాతం ఆశాజనకంగా ఉంటుంది. అందువల్ల లేత భాగాలను విత్తనంగా ఉపయోగించటం ఉత్తమం. ఎకరాకు 3 నుంచి 4 టన్నుల మూడుకళ్ల ముచ్చెలను విత్తనంగా వాడాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.