News February 26, 2025
నిర్మల్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

1)నిర్మల్ పోలింగ్ కేంద్రాలకు తరలిన ఎన్నికల సామగ్రి
2)నిర్మల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ ఉద్యోగాలు
3)నర్సాపూర్ (జి)లో 218 లీటర్ల అక్రమ మద్యం పట్టివేత
4)కుబీర్: గుండెపోటుతో లైన్ ఇన్స్పెక్టర్ మృతి
5)దస్తూరాబాద్: పురుగుమందు తాగి ఒకరి సూసైడ్
6)నిర్మల్ : జిల్లా అంతటా శివరాత్రి వేడుకలు
Similar News
News February 27, 2025
మారుమూల గ్రామాల్లో అల్లూరి ఎస్పీ పర్యటన

పెదబయలు మండలం మారుమూల జామిగూడా పంచాయతీ గుంజివాడ, చింతల వీధి గ్రామాలలో బుధవారం అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్, ఏఎస్పీ ధీరాజ్ పర్యటించారు. గుంజివాడ గ్రామంలో శివరాత్రి సందర్భంగా జరుగుతున్న బాపనమ్మ బాలలింగేశ్వర దేవత జాతర సందర్భంగా దైవ దర్శనం చేసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమీపంలో గల తారాబు జలపాతాన్ని సందర్శించి సందడి చేశారు.
News February 27, 2025
నిర్మల్ : చెట్టుపై నుంచి పడి వ్యక్తి దుర్మరణం

నిర్మల్ గాంధీ పార్క్ సమీపంలో పెరిగిన చెట్ల కొమ్మలను కొట్టేందుకు చెట్టు ఎక్కిన ఓ వ్యక్తి మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని వాల్మీకీనగర్‌కు చెందిన దూదేకుల కాసిం(47) చెట్ల కొమ్మలను కొట్టేందుకు చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కింద పడిపోగా గాయపడ్డారు. బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు.
News February 27, 2025
రాష్ట్ర పోలీస్ కబడ్డి మహిళ జట్టులో జిల్లా వాసికి చోటు

నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామానికి చెందిన గోదావరి రాష్ట్ర పోలీసు కబడ్డి ఉమెన్స్ జట్టుకు ఎంపికైనట్లు జిల్లా కబడ్డి కోచ్ మీసాల ప్రశాంత్ తెలిపారు. ప్రస్తుతం గోదావరి నిజామాబాద్ పోలీసు డిపార్ట్మెంట్‌లో విధులు నిర్వహిస్తోంది. జాతీయ స్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారిణి ఎంపికవడంపై కబడ్డి అసోసియేషన్ అధ్యక్షుడు లింగయ్య, కార్యదర్శి గంగాధర్, కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.