News February 27, 2025

ఎన్నికలవేళ పోలింగ్ కేంద్రాల్లో పోలీస్ ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ

image

రేపు జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మట్టవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్లామీయా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల భద్రత కోసం చేపట్టాల్సిన జాగ్రత్తలపై ఏసీపీ బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బందికి వివరించారు.

Similar News

News February 27, 2025

ఇంగ్లండ్‌ను ఓడించిన అఫ్గాన్ వెనుక మాస్టర్ మైండ్ ఈయనే..

image

CTలో ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చిన అఫ్గాన్ జట్టు వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జొనాథన్ ట్రాట్‌ కావడం గమనార్హం. 2022లో ఆయన అఫ్గాన్ హెడ్ కోచ్‌గా వచ్చారు. ఆయన నేతృత్వంలోని జట్టు 2023 వన్డే WCలో PAK, ENGకు షాక్ ఇచ్చి, SL, నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. తర్వాత BANపై తొలిసారి వన్డే సిరీస్‌ను, PAKపై T20 సిరీస్‌ను గెలుచుకుంది. ఇప్పుడు CTలోనూ ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

News February 27, 2025

BREAKING: అస్సాంలో భూకంపం

image

వరుస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైంది. తెల్లవారుజామున 2.25 గంటలకు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. కాగా మంగళవారం కోల్‌కతా, ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలోని బంగాళాఖాతంలో, బుధవారం ఇండోనేషియాలోని సులవేసి ప్రావిన్స్‌లో భూకంపం వచ్చింది.

News February 27, 2025

అనుకోకుండా గెలవలేదు.. అలవాటు చేసుకున్నారు: సచిన్

image

CTలో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించిన అఫ్గాన్ టీమ్‌పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆ జట్టు ఎదుగుతున్న తీరు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. వారు అనుకోకుండా గెలిచారని ఇకపై ఎవరూ భావించొద్దన్నారు. అఫ్గాన్ కుర్రాళ్లు గెలుపులను అలవాటుగా మార్చుకున్నారని తెలిపారు. ఈ మ్యాచ్‌లో భారీ సెంచరీ చేసిన జద్రాన్, 5 వికెట్లు తీసిన ఒమర్‌జాయ్‌ని ప్రత్యేకంగా అభినందించారు.

error: Content is protected !!