News February 27, 2025

హనుమకొండ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

✓ HNK: ఆధ్యాత్మిక సమ్మేళన కార్యక్రమానికి హాజరైన మాజీమంత్రి హరీశ్ రావు
✓ MLC ఎన్నికలను విజయవంతం చేద్దాం: CP
✓ HNK: ఎన్నికల పోలింగ్ మెటీరియల్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
✓ బంగారు ఆభరణాలతో జాగ్రత్తగా ఉండాలి: HNK ACP
✓ హైదరాబాదుకు దీటుగా వరంగల్ అభివృద్ధి: MP కడియం కావ్య
✓ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సెంట్రల్ జోన్ డీసీపీ

Similar News

News January 5, 2026

NRPT: విధుల నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలి

image

రాబోయే మున్సిపల్ ఎన్నికల విధుల నుంచి ఆర్ఓ, ఏఆర్ఓలుగా పదో తరగతి బోధించే ఉపాధ్యాయులను మినహాయించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ పక్షాన నారాయణపేట కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ శ్రీనుకు సోమవారం నేతలు వినతిపత్రం అందించారు. వారి స్థానంలో ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులను, యూపీఎస్ పాఠశాలలో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్‌లను వినియోగించుకోవాలని జిల్లా అధ్యక్షుడు నరసింహ కోరారు.

News January 5, 2026

20% నిల్వలున్నా.. 1% ఉత్పత్తే: వెనిజులాకు ఎందుకీ దుస్థితి?

image

ప్రపంచ చమురు నిల్వల్లో 20% వాటా ఉన్న వెనిజులా ప్రస్తుతం కేవలం 1% (10 లక్షల బ్యారెళ్లు) మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. 1990ల్లో 35 లక్షలుగా ఉన్న ఈ ఉత్పత్తి.. స్కిల్డ్ వర్కర్ల తొలగింపు, కంపెనీల జాతీయీకరణ, అవినీతి, నిధుల మళ్లింపు, అమెరికా ఆంక్షల వల్ల ఘోరంగా పడిపోయింది. ఇప్పుడు మదురోను బంధించిన ట్రంప్.. US కంపెనీల పెట్టుబడులతో ఈ భారీ నిల్వలను వెలికితీసి ప్రపంచ చమురు మార్కెట్‌ను శాసించాలని స్కెచ్ వేశారు.

News January 5, 2026

బాపట్ల: ఎస్పీ కార్యాలయ పీజీఆర్ఎస్‌కి 67 అర్జీలు

image

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో 67 అర్జీలు అందినట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఫిర్యాదులను చట్టపరిధిలో వేగంగా పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం జరిగే కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని జిల్లా ఎస్పీ వెల్లడించారు.