News February 27, 2025

జనగామ జిల్లా వ్యాప్తంగా 1002 మంది ఓటర్లు

image

రేపు నిర్వహించబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 1002 ఓటర్లు ఉన్నట్లు జిల్లా అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనగామ 511, దేవరుప్పుల 52, కొడకండ్ల 32, చిల్పూర్ 16, స్టేషన్ ఘనపూర్ 57, తరిగొప్పుల 16, లింగాల గణపురం 47, బచ్చన్నపేట 70, జఫర్గడ్ 29, నర్మెట్ట 31, రఘునాథపల్లి 47, పాలకుర్తిలో 84 ఉపాధ్యాయులు ఎన్నికల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.

Similar News

News September 19, 2025

దేశంలో ఉస్మానియా మెడికల్ కాలేజీకి 48వ స్థానం

image

ఇటీవల ప్రకటించిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్స్- 2025లో ఉస్మానియా మెడికల్ కాలేజీ 51.46 స్కోరుతో వరుసగా రెండోసారి 48వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్స్ కోసం దేశ వ్యాప్తంగా 223 మెడికల్ కాలేజీలు పోటీ పడ్డాయి. ఎయిమ్స్ (న్యూఢిల్లీ) 1వ ర్యాంకులో నిలవగా PGIMER (చండీగఢ్), CMC (వెల్లూర్), జిప్మర్ (పాండిచేరి) మొదటి 3 ర్యాంకుల్లో నిలిచాయి.

News September 19, 2025

దసరా సెలవుల వేళ.. HYD విద్యార్థులకు గుడ్‌న్యూస్

image

దసరా సెలవులు వచ్చాయంటే విద్యార్థులకు ఆనందమే.. ఆనందం.. సిటీలో ఉన్న లక్షలాది మంది విద్యార్థులు సొంతూరికి వెళతారు. ఈ క్రమంలో వారు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ ఈడీ రాజశేఖర్‌ తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వీటిని ఏర్పాటు చేశామన్నారు. బస్సుల వివరాల కోసం 9959226148, /6142, / 6136/ 6129 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.

News September 19, 2025

జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. నిమ్స్‌లో మీడియా సెంటర్

image

నిమ్స్ ఆస్పత్రిలో జర్నలిస్టులు, అధికారులకు వాగ్వాదాలు జరిగిన నేపథ్యంలో మీడియా సెంటర్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. సమాచారం కోసం వచ్చే మీడియా ప్రతినిధుల సౌకర్యార్థం మీడియా సెల్ ఏర్పాటు చేశామని ఆస్పత్రి మీడియా ఇన్‌ఛార్జి సత్యాగౌడ్‌ తెలిపారు. అక్కడే పార్కింగ్‌ సదుపాయమూ కల్పించామన్నారు. జర్నలిస్టులకు సిబ్బంది ద్వారా ఇబ్బందులు ఎదురవుతున్న అంశాలపై యాజమాన్యం దృష్టి సారించిందన్నారు.