News February 27, 2025

సంగారెడ్డి: ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం

image

ఉమ్మడి MDK- KNR- NZB- ADB పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు సంగారెడ్డి ఆర్టీవో రవీందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాం. 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు అమలు చేస్తామని, ప్రశాంతంగా ఎన్నికల నిర్వాహణకు సహకరించాలని SP కోరారు. పట్టభద్రుల బరిలో 56 మంది టీచర్స్ పోటీలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు.

Similar News

News February 27, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లాలో నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన ∆} ఖమ్మం జిల్లాలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పర్యటన ∆} వైరా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం నగరంలో ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి పర్యటన ∆} ఏన్కూర్ వ్యవసాయ మార్కెట్ మార్కెట్‌కు సెలవు ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద పర్యటన.

News February 27, 2025

తాడేపల్లి: చేనేత వస్త్రంపై లోకేశ్ కుటుంబ చిత్రం

image

మంగళగిరికి చెందిన తెలుగుదేశం పార్టీ అభిమాని జంజనం మల్లేశ్వరరావు, ఆయన కుమారుడు కార్తికేయ బుధవారం ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లోకేశ్ కుటుంబ సభ్యుల చిత్రాలతో నేత నేసిన చేనేత వస్త్రాన్ని మంత్రికి బహుకరించారు. లోకేశ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు వారు ఆసక్తి చూపడం అభినందనీయని, వారికి పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు.

News February 27, 2025

HYD: మానసికంగా ఒత్తిడి ఉందా..? కాల్ చేయండి!

image

HYD, MDCL, RR జిల్లావాసులు ఒత్తిడికి గురవడం, మానసికంగా ఆవేదన చెందడం వంటి సమస్యలను ఎదుర్కొంటే టెలీ మానస్ హెల్ప్‌లైన్ 14416కు కాల్ చేయాలని ఉప్పల్ పీహెచ్సీ డాక్టర్ సౌందర్యలత తెలిపారు. నిష్ణాతులైన వైద్యులు సలహాలు సూచనలు అందజేస్తారు. మీ పిల్లల ప్రవర్తనలో ఏవైనా మానసిక తేడాలు గుర్తించినా కాల్ చేయొచ్చన్నారు. మానసిక సంబంధిత అంశాలన్నింటికి పరిష్కారం ఉంటుందని, ఈ విషయాన్ని అందరికీ తెలపాలని కోరారు.
#SHARE IT.

error: Content is protected !!