News February 27, 2025
రికార్డు సృష్టించిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సీజన్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సీజన్‌లో ఇప్పటివరకు 11 సెంచరీలు నమోదయ్యాయి. ఒక సీజన్‌లో అన్ని జట్లు కలిపి చేసిన అత్యధిక సెంచరీలు ఇవే. గతంలో 2002, 2017లో 10 శతకాలు నమోదయ్యాయి. ఈ రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. 2006లో 7, 2000, 2009లో 6, 1998, 2004లో 4, 2013లో 3 శతకాలు నమోదయ్యాయి. కాగా ఇవాళ జరిగిన ఇంగ్లండ్-అఫ్గానిస్థాన్ మ్యాచులో 2 సెంచరీలు వచ్చాయి. జో రూట్, ఇబ్రహీం జద్రాన్ శతకాలు బాదారు.
Similar News
News February 27, 2025
100 కోట్ల మంది సంపాదన అంతంతమాత్రమే!

దేశంలోని 140 కోట్లకు పైగా జనాభాలో 100 కోట్ల మంది సంపాదన అంతంతమాత్రమే అని వెంచర్ క్యాపిటల్ సంస్థ బ్లూమ్ వెంచర్స్ అంచనా వేసింది. స్వేచ్ఛగా ఖర్చు చేయగలిగే వినియోగదారులు 13-14కోట్లే అని పేర్కొంది. మరో 30 కోట్ల మంది ఇప్పుడిప్పుడే పర్సుల్లోంచి డబ్బులు తీయడం స్టార్ట్ చేశారని తెలిపింది. మరోవైపు, దేశంలోని 57.7శాతం సంపద కేవలం 10శాతం మంది భారతీయుల వద్దే ఉందని బ్లూమ్ వెంచర్స్ స్పష్టం చేసింది.
News February 27, 2025
మహా కుంభమేళా మళ్లీ ఎప్పుడంటే?

144 ఏళ్లకు ఒకసారి వచ్చే అత్యంత అరుదైన మహా కుంభమేళా నిన్నటితో ముగిసింది. త్రివేణీ సంగమం వద్ద 45 రోజుల్లో 66.21 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఇక గతంలో 1881లో జరిగిన మహా కుంభమేళా మళ్లీ 2169 సంవత్సరంలో రానుంది. ఇప్పుడున్న వాళ్లు ఎవరూ ఆ కుంభమేళాను చూడలేకపోవచ్చు. రాబోయే తరాలు ఆ మహా ఘట్టంలో భాగం కానున్నాయి.
News February 27, 2025
సెలీనియం అంటే?

<<15592975>>సెలీనియం<<>> అనేది నీరు, కొన్ని రకాల ఆహార పదార్థాల నుంచి శరీరానికి సహజంగా అందే ఖనిజం. ఇది థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి, పునరుత్పత్తి అవయవాలు పని చేసేందుకు చాలా అవసరం. దీని అవసరం కొంతే అయినా ఆరోగ్యాన్ని కాపాడటంతో కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ సెలీనియం మోతాదు ఎక్కువైతే జుట్టు రాలడం, గోళ్లు పెలుసుగా మారటం, చర్మ సంబంధ వ్యాధులొస్తాయి. ముఖ్యంగా వెంట్రుకల కుదుళ్లను బలహీనపరిచి జుట్టు రాలడానికి కారణం అవుతుంది.