News February 27, 2025

శ్రీశైలంలో కనుల పండువగా మల్లికార్జునుడి కళ్యాణం

image

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జునుడి కళ్యాణం కనుల పండువగా సాగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, వేలాదిగా తరలివచ్చిన భక్తుల శివనామ స్మరణ, మంగళవాయిద్యాల మధ్య ఆ మల్లికార్జునుడు బ్రమరాంభ అమ్మవారి మెడలో మూడుముళ్లు వేశారు. అనంతరం పండితులు స్వామి, అమ్మవార్లకు ముత్యాల తలంబ్రాలు పోశారు. ఈ వేడుకను చూసి భక్తులు తరించారు.

Similar News

News February 27, 2025

రాముడిలానే కాదు.. కొన్నిసార్లు శివుడిలా ఉండాలి: మంత్రి లోకేశ్

image

AP: శివుడిని తలచుకున్నా, ఆయన విగ్రహం చూసినా తనకు ఎంతో బలం వస్తుందని మంత్రి లోకేశ్ తెలిపారు. శివరాత్రి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘బాబు గారి అరెస్ట్ తర్వాత నా ఆలోచన విధానం మారింది. శివుడిపై భక్తి చాలా పెరిగింది. రాముడిలానే కాదు.. కొన్నిసార్లు శివుడిలా ఉండాలనే నమ్మకం కలిగింది. నా యువగళం పాదయాత్రలో స్వయంగా శివుడే నన్ను నడిపించాడు’ అని వ్యాఖ్యానించారు.

News February 27, 2025

‘భారత్‌ను ఫైనల్లో ఓడిస్తామన్నావుగా.. ఇప్పుడేమైంది?’

image

AFG చేతిలో ఓటమి అనంతరం ఇంగ్లండ్ క్రికెటర్ డకెట్‌పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవల INDపై వరుసగా రెండు వన్డేలు ఓడిపోయాక డకెట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మేం 3-0 తేడాతో ఓడినా పెద్ద మ్యాటర్ కాదు. మేం ఇక్కడికి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వచ్చాం. ఇండియాను ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓడిస్తాం. అప్పుడు ఈ ఓటమిని ఎవరూ గుర్తుంచుకోరు’ అని అన్నారు. కానీ CTలో ఇంగ్లండ్ సెమీస్ కూడా చేరకుండానే ఇంటిదారి పట్టింది.

News February 27, 2025

‘తెలుగు’కు దక్కిన గౌరవం

image

పక్క రాష్ట్రాలకు వెళ్లినప్పుడు మనకు అక్కడి భాషల్లోనే నేమ్ బోర్డులు కనిపిస్తుంటాయి. కానీ, కుంభమేళాలో భాగంగా UPలోని చాలా ప్రాంతాల్లో తెలుగు బోర్డులు దర్శనం ఇచ్చాయి. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే మార్గాల్లో, త్రివేణీ సంగమం వద్ద, కాశీలోనూ UP ప్రభుత్వం తెలుగుభాషలో బోర్డులు ఏర్పాటు చేసింది. దీంతో AP, తెలంగాణ నుంచి వెళ్లిన భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలుగు భాషకు దక్కిన గౌరవం అని పలువురు గర్వపడ్డారు.

error: Content is protected !!