News February 27, 2025
ఈనెల 28న సైన్స్ కార్యక్రమాలు నిర్వహించాలి: DEO

జాతీయ వైజ్ఞానిక దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 28న పెద్దపల్లి జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో సృజనాత్మకత సైన్స్ కార్యక్రమాలు నిర్వహించాలని DEO మాధవి తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, ఉపన్యాస, చిత్రలేఖన పోటీలు, సైన్స్ శాస్త్రవేత్తలు- వారి ఆవిష్కరణ, ప్రయోగ ప్రదర్శనలు తదితర అంశాలలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వివరాలకు జిల్లా సైన్స్ అధికారి రవినందన్ రావును సంప్రదించాలన్నారు.
Similar News
News January 3, 2026
జగిత్యాల: ‘వసతి గృహాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’

వసతి గృహాల్లో విద్యార్థుల పట్ల బాధ్యతాయుతంగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని జగిత్యాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కే.రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో షెడ్యూల్డ్ కులాల వసతి గృహ ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగుల సంఘం-2026 క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. విద్యార్థుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఉన్నారు.
News January 3, 2026
ANUలో విద్యార్థులకు క్యాంపస్ డ్రైవ్

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు శుక్రవారం క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహించిన ఈ డ్రైవ్‌లో భాగంగా ప్రీ ప్లేస్మెంట్, అసెస్మెంట్‌లో 150 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డా.ఎండీ తౌసిఫ్ అహ్మద్ తెలిపారు. క్వాలిఫై అయిన విద్యార్థులకు శనివారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
News January 3, 2026
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

సిక్కోలు వాసులకు గుడ్ న్యూస్
సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్కరికీ చేరాలి: ఎమ్మెల్యే శిరీష
నరసన్నపేట: రహదారులపై పారుతున్న మురుగు నీరు
జలుమూరు: ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
ప్రపంచ తెలుగు మహాసభలకు పొందూరు వాసికి ఆహ్వానం
టెక్కలి: ధాన్యం కొనుగోళ్లులో కానరాని కస్టోడియన్లు జాడ
ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించండి: ఎమ్మెల్యే బగ్గు
జిల్లాలో పలుచోట్ల రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ


