News February 27, 2025
నిర్మల్: 109 మంది ఓటేశారు..!

నిర్మల్ జిల్లా పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో గత మూడు రోజుల నుంచి జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ బుధవారం ముగిసింది. ఎన్నికల విధుల్లోని ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం జిల్లాలో మొత్తం 149 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 109 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పోలింగ్ అధికారులు తెలిపారు.
Similar News
News November 6, 2025
చేతులు మెరిసేలా..

కొందరిలో ముఖం ప్రకాశవంతంగానే ఉన్నా.. చేతులు మాత్రం జీవం కోల్పోయినట్లుగా తయారవుతాయి. దీనికోసం ఉప్పుతో తయారుచేసిన స్క్రబ్‌ని ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కొద్దిగా ఉప్పులో లావెండర్ నూనె కలిపి దాన్ని చేతులకు రాసుకోవాలి. పదినిమిషాల తర్వాత మృదువుగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి. ఈ చిట్కాను వారానికి రెండుసార్లు పాటిస్తే చేతులపై చేరిన మృతకణాలు, మురికి తొలగిపోయి మృదువుగా మారతాయి.
News November 6, 2025
WGL: క్వింటా పసుపు రూ.11,738

చాలా రోజుల అనంతరం వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు గురువారం పసుపు తరలివచ్చింది. ఈ క్రమంలో క్వింటా పసుపుకు రూ.11,738 ధర వచ్చింది. అలాగే మొక్కజొన్న సైతం తరలిరాగా రెండు రోజులతో పోలిస్తే ధర భారీగా పడిపోయింది. సోమవారం మక్కలు (బిల్టీ) క్వింటాకి రూ.2,095, మంగళవారం రూ.2,055 ధర వస్తే.. ఈరోజు రూ.2,010 కి పతనమైంది. అలాగే దీపిక మిర్చి రూ.15,500 ధర వచ్చింది.
News November 6, 2025
తెలంగాణ న్యూస్ అప్‌డేట్స్ @2PM

*రేపు జరగాల్సిన క్యాబినెట్ మీటింగ్ ఈ నెల 12కు వాయిదా
*హైదరాబాద్ బోరబండలో బండి సంజయ్ కార్నర్ మీటింగ్‌కు అనుమతి రద్దు చేశారంటూ బీజేపీ నేతల ఆందోళన.. సభ జరిపి తీరుతామని స్పష్టం
*జూబ్లీహిల్స్‌లో 3 పార్టీల మధ్య గట్టి పోటీ ఉందన్న కిషన్ రెడ్డి
*ఫిరాయింపు MLAలు తెల్లం వెంకట్రావు, సంజయ్‌లను నేడు విచారించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్


