News February 27, 2025
నిర్మల్ : చెట్టుపై నుంచి పడి వ్యక్తి దుర్మరణం

నిర్మల్ గాంధీ పార్క్ సమీపంలో పెరిగిన చెట్ల కొమ్మలను కొట్టేందుకు చెట్టు ఎక్కిన ఓ వ్యక్తి మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని వాల్మీకీనగర్‌కు చెందిన దూదేకుల కాసిం(47) చెట్ల కొమ్మలను కొట్టేందుకు చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కింద పడిపోగా గాయపడ్డారు. బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు.
Similar News
News February 27, 2025
కాకినాడ: ఐదుకు చేరిన జీబీఎస్ కేసులు

కాకినాడ జిల్లాను జీబీఎస్ వైరస్ వణికిస్తోంది. ఇప్పటివరకు ఐదు కేసులు నమోదయ్యాయి. గతంలో నాలుగు కేసులు ఉండగా బుధవారం ఇదే వైరస్‌తో మరో వ్యక్తి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఒకరు డిశ్చార్జి కాగా నలుగురు చికిత్స పొందుతున్నారు. గిలియన్ బార్ సిండ్రోమ్ లక్షణాలు ఉన్నవారు కాకినాడ జీజీహెచ్‌కు రావాలని సూపరిండెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి కోరారు.
News February 27, 2025
HZB: ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది సస్పెన్షన్

హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న 15 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు. ఆస్పత్రికి వచ్చిన రోగులను ప్రైవేటు ఆస్పత్రిలకు పంపిస్తున్నారని ఆరోపణల మేర వారం రోజుల క్రితం విచారణ జరిపి డీఎంహెచ్‌వో వెంకట రమణ కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి తెలిపారు.
News February 27, 2025
మహాశివరాత్రి.. రామప్పలో నేటి కార్యక్రమాలు ఇవే

రామప్ప దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా రెండవ రోజు ఉదయం అభిషేకంతో ప్రారంభమై, వీరభద్ర పల్లెరము, భద్రకాళి పూజ, నిత్య పూజలు జరగనున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున అగ్ని గుండాలలో నడుచుట కార్యక్రమాలతో రెండో రోజు కార్యక్రమాలు ముగియనున్నాయి. రెండవ రోజు భక్తుల సౌకర్యార్థము ఆర్టీసీ బస్సులను నడపనున్నారు.