News February 27, 2025
మారుమూల గ్రామాల్లో అల్లూరి ఎస్పీ పర్యటన

పెదబయలు మండలం మారుమూల జామిగూడా పంచాయతీ గుంజివాడ, చింతల వీధి గ్రామాలలో బుధవారం అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్, ఏఎస్పీ ధీరాజ్ పర్యటించారు. గుంజివాడ గ్రామంలో శివరాత్రి సందర్భంగా జరుగుతున్న బాపనమ్మ బాలలింగేశ్వర దేవత జాతర సందర్భంగా దైవ దర్శనం చేసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమీపంలో గల తారాబు జలపాతాన్ని సందర్శించి సందడి చేశారు.
Similar News
News November 26, 2025
చెట్టు కోసం 363 మంది ప్రాణాలు కోల్పోయారు!

రాజస్థాన్ రాష్ట్ర వృక్షమైన హేజ్రీ చెట్టు ఉనికి వెనుక వందల మంది ప్రాణత్యాగం ఉందనే విషయం తెలుసా? 1730లో జోధ్‌పూర్ రాజు అభయ్ సింగ్ ప్యాలెస్ నిర్మాణానికి కలప సేకరించాలని సైనికులను పంపారు. ఇది తెలుసుకున్న బిష్ణోయ్ కమ్యూనిటీ సైనికులను అడ్డుకుంది. చెట్టును కౌగిలించుకుని నరకొద్దని కోరింది. సైనికులు వినకుండా 363 మందినీ నరికేశారు. ఇది తెలుసుకున్న రాజు చలించి చెట్లను నరకొద్దని ఆదేశించడంతో ఆ చెట్టు బతికింది.
News November 26, 2025
మున్సిపాల్టీల విలీనంతో HMDA ఆదాయానికి గండి

గ్రేటర్‌లో మున్సిపాల్టీల విలీనం తరువాత HMDA ఆదాయం కోల్పోనుంది. ప్రస్తుతం శివారు ప్రాంతాల మున్సిపాలిటీల నుంచి HMDAకు ఆదాయం అధికంగా వస్తోంది. కేబినెట్ నిర్ణయంతో 27 మున్సిపాల్టీలో గ్రేటర్లో భాగం కానున్నాయి. అంటే.. హెచ్ఎండీఏ పరిధి కూడా తగ్గనుంది. ఈ క్రమంలో రాబడి కూడా తగ్గిపోతుంది. HMDAకు నెలనెలా సుమారు రూ.100 కోట్లు ఆదాయం వస్తుండగా.. విలీనం అనంతరం రూ.20 కోట్లకు పడిపోతుందని సమాచారం.
News November 26, 2025
సిద్దిపేట: కలెక్టరేట్‌లో భారత రాజ్యాంగ దినోత్సవం

సిద్దిపేట జిల్లా ఐడీఓసీ సమావేశ మందిరంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హైమావతి ముఖ్య అతిథిగా హాజరై, కార్యాలయంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి రాజ్యాంగ ప్రతిజ్ఞను చదివించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్యం ప్రాధాన్యతను, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.


