News February 27, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్

ఉమ్మడి MDK- KNR- NZB- ADB పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాం. 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు అమలు చేస్తామని, ప్రశాంతంగా ఎన్నికల నిర్వాహణకు సహకరించాలని SP కోరారు. పట్టభద్రుల బరిలో 56 మంది టీచర్స్ పోటీలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు.
Similar News
News September 18, 2025
మాసాయిపేట: ట్రావెల్స్ బస్సులో గుండెపోటుతో ప్రయాణికుడి మృతి

మెదక్ జిల్లా మాసాయిపేటలో హైవే-44పై జరిగిన <<17746368>>రోడ్డు ప్రమాద<<>> ఘటనలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. అర్ధరాత్రి వేళ ట్రావెల్స్ బస్సు అతివేగంగా వచ్చి రెండు కార్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సులో ఉన్న UPకి చెందిన రాజ్ కుమార్ పాల్ గుండెపోటుకు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
News September 18, 2025
గద్వాల: 4 నెలల క్రితం నిశ్చితార్థం.. యువతి సూసైడ్

కేటీదొడ్డి మండలంలోని ముత్యాల తండాకు చెందిన యువతి ఈరమ్మ(19) ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారం మేరకు.. ఆమెకు నాలుగు నెలల కిందట మద్దెలబండ తండాకు చెందిన యువకుడితో నిశ్చితార్థం జరిగింది. కాగా బుధవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుంది. తరచూ ఫోన్‌లో మాట్లాడేదని, పెళ్లికి ముందు ఇలా జరగడంతో కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువతి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 18, 2025
మోదీకి విషెస్ జెన్యూన్ కాదన్న యూట్యూబర్‌పై విమర్శలు

ప్రధాని మోదీకి బర్త్ డే విషెస్ చెబుతూ ప్రముఖులు చేసిన ట్వీట్లు జెన్యూన్ కాదని యూట్యూబర్ ధ్రువ్ రాథీ ఆరోపించారు. ప్రముఖులు విష్ చేసేలా ఆయన టీమ్ ముందే వారికి ‘టూల్ కిట్’ ఇచ్చిందన్నారు. దీంతో ధ్రువ్ రాథీపై మోదీ అభిమానులు ఫైరవుతున్నారు. ట్రంప్, మెలోనీ, పుతిన్ వంటి నేతలను కూడా ఆయన టీమ్ మ్యానేజ్ చేసిందా అని ప్రశ్నిస్తున్నారు. రాహుల్, కేజ్రీవాల్‌కు కూడా ‘టూల్ కిట్’ ఇచ్చారా అని కౌంటర్ ఇస్తున్నారు.