News February 27, 2025
వరంగల్: విద్యార్థిని ఆత్మహత్య.. UPDATE

WGL నగరంలో ఉరేసుకొని బుధవారం <<15587387>>విద్యార్థిని ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన రేష్మిత WGL ములుగు రోడ్డులోని వ్యవసాయ విద్యాలయంలో ఫస్టియర్ చదువుతోంది. విద్యార్థినికి ఇంటిపై బెంగ ఉండటంతో అప్పుడప్పుడు తల్లి ఆమెతో పాటు హాస్టల్లో ఉండేందుకు యాజమాన్యం ఒప్పుకుంది. కాగా, నిన్న శివరాత్రి కావడంతో తోటి విద్యార్థులు సొంతూరు వెల్లగా ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
Similar News
News January 9, 2026
BHPL: ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంటేనే పథకాలకు అర్హత!

వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసేందుకు ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకొచ్చింది. ప్రతి రైతు ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఐడీ నంబర్ ఉంటేనే పీఎం కిసాన్ తదితరాలకు అర్హత ఉంది. పట్టాదారు పాసుబుక్, ఆధార్ కార్డు, మొబైల్
నంబర్‌తో వ్యవసాయ శాఖ ఆఫీసుకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జిల్లాలో 1,24,479 మంది రైతులు ఉండగా, 53,792 మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
News January 9, 2026
అంతరిక్షంలో అనారోగ్యం.. ముందే తిరిగొస్తున్న వ్యోమగాములు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి నలుగురు వ్యోమగాములు నెల ముందే భూమికి తిరిగి వస్తున్నారు. ఒక ఆస్ట్రోనాట్‌కు ఎదురైన ‘సీరియస్ మెడికల్ కండిషన్’ వల్ల నాసా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ వ్యక్తి పేరు కానీ, హెల్త్ ప్రాబ్లం ఏంటనేది కానీ బయటపెట్టలేదు. ఇది ఎమర్జెన్సీ కాదని, కేవలం ముందు జాగ్రత్త కోసమేనని క్లారిటీ ఇచ్చింది. 2000 నుంచి ISSలో ఇలా మిషన్ మధ్యలోనే ఆపేయడం ఇదే మొదటిసారి.
News January 9, 2026
తూ.గో: సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఇదే!

సీఎం చంద్రబాబు శుక్రవారం తూ.గో జిల్లాలో పర్యటించనున్నారు. ఉ. 10:20 గంటలకు ఉండవల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి రాయవరం చేరుకుంటారు.11:20 గంటలకు గ్రామ రైతులతో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు. మ. 12:05 గంటలకు రాయవరంలో ప్రజా వేదిక సభలో పాల్గొంటారు. మ. 2:05 గంటలకు కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సా. 4:25 అమరావతి బయలుదేరి వెళ్తారు.


