News February 27, 2025
మహా కుంభమేళా మళ్లీ ఎప్పుడంటే?

144 ఏళ్లకు ఒకసారి వచ్చే అత్యంత అరుదైన మహా కుంభమేళా నిన్నటితో ముగిసింది. త్రివేణీ సంగమం వద్ద 45 రోజుల్లో 66.21 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఇక గతంలో 1881లో జరిగిన మహా కుంభమేళా మళ్లీ 2169 సంవత్సరంలో రానుంది. ఇప్పుడున్న వాళ్లు ఎవరూ ఆ కుంభమేళాను చూడలేకపోవచ్చు. రాబోయే తరాలు ఆ మహా ఘట్టంలో భాగం కానున్నాయి.
Similar News
News February 27, 2025
భార్యకు నచ్చలేదని రూ.27 లక్షల కారును..

రష్యాలో ఓ వ్యక్తి ప్రేమికుల రోజున తన భార్యకు ఖరీదైన రూ.27 లక్షల పోర్షే కారును బహుమతిగా ఇచ్చారు. దానికి చిన్నచిన్న డ్యామేజ్‌లు ఉండటంతో తనకు నచ్చలేదని తిరస్కరించింది. విసుగెత్తిన భర్త ఆ కారును డంపింగ్ యార్డులో పడేశారు. అయితే ఈ వెహికల్ దగ్గర చాలామంది ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ప్రాంతం టూరిస్ట్ స్పాట్‌గా మారింది. దీంతో రెండు వారాలు గడిచినా అధికారులు ఆ కారును తీసే ప్రయత్నం చేయట్లేదు.
News February 27, 2025
Gold Cardతో భారతీయుల్ని నియమించుకోండి: ట్రంప్ ఆఫర్

US వర్సిటీల్లో గ్రాడ్యుయేట్లు అయ్యే భారతీయులను అమెరికన్ కంపెనీలు ఇకపై ‘గోల్డ్ కార్డు’ కింద నియమించుకోవచ్చని Prez డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘భారత్, చైనా సహా వేర్వేరు దేశాల నుంచి హార్వర్డ్ వంటి వర్సిటీలకు స్టూడెంట్స్ వస్తున్నారు. టాపర్లుగా అవతరించి జాబ్ ఆఫర్లు కొట్టేస్తున్నారు. వారు దేశంలో ఉంటారో లేదో తెలీదు కాబట్టి వెంటనే రిజెక్ట్ చేస్తున్నారు. గోల్డ్ కార్డుతో ఆ ఇబ్బంది తొలగిపోతుంది’ అని అన్నారు.
News February 27, 2025
ఆ పేరు వింటే తెల్ల దొరల వెన్నులో వణుకు పుట్టేది!

బ్రిటిష్ పాలకులను గజగజలాడించిన చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి నేడు. 1906 జులై 23న మధ్యప్రదేశ్ అలీరాజ్‌పూర్ జిల్లాలో జన్మించిన ఈయన.. చిన్న వయసులోనే స్వాతంత్ర్య ఉద్యమంలో చేరారు. బ్రిటిషర్ల నుంచి భరతమాతకు విముక్తి కల్పించేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. భగత్ సింగ్‌తో చేయి కలిపి అతని సాయుధ విభాగానికి కమాండర్ ఇన్ చీఫ్‌గా వ్యవహరించారు. 1931లో 24 ఏళ్లకే వీరమరణం పొందారు.