News March 22, 2024

బారు షాపుల్లో రిజిస్టర్లు మెంటైన్ చేయాలి: కలెక్టర్

image

చెక్‌పోస్టుల వద్ద పటిష్ఠమైన నిఘా పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అమ్మకాలు, ఎక్కడైనా ఎక్కువ మోతాదులో నిల్వ చేసిన అక్రమ మద్యం, అక్రమ మద్యం రవాణా, ఎక్సైజ్, సెబ్ కలసి నివారణ చర్యలుపై గురువారం సమీక్షించారు. షాపులు తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. షాపుల్లో రోజు వారీ రిజిస్టర్లు మెంటైన్ చేయాలన్నారు

Similar News

News July 5, 2024

శ్రీకాకుళం: నేటితో ముగుస్తున్న ఫీజు చెల్లింపు గడువు

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ డిగ్రీ చివరి ఏడాది 5వ సెమిస్టర్ ఇన్స్టంట్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగియనుంది. విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు జూన్ 29 నుంచి అవకాశం ఇచ్చారు. ఇప్పటికే ఈ పరీక్షకు అర్హులైన జాబితాను ఆయా కళాశాలలకు అధికారులు అందజేశారు. ఇంకా చెల్లించని విద్యార్థులు నేడు సాయంత్రం లోగా చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.

News July 5, 2024

శ్రీకాకుళం: అధికారులు అంకిత భావంతో పనిచేయాలి

image

అధికారులు అంకిత భావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ జి.ఆర్. రాధిక, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌లతో కలిసి జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అర్హత కలిగిన ప్రతీ లబ్ధిదారునికి అందించే దిశగా అంకితభావంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.

News July 5, 2024

శ్రీకాకుళం: 8 నుంచి ఎయిర్‌ఫోర్స్‌కు దరఖాస్తులు

image

అగ్నివీర్, అగ్నిపథ్ స్కీమ్ కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పని చేయుటకు ఆసక్తి ఉన్న వారు ఈనెల 8 నుంచి 28వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధి అధికారి శుక్రవారం తెలిపారు. అవివాహిత యువత ఇంటర్ లేదా 10వ తరగతిలో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. వివరాలకు https://agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.