News February 27, 2025

కవిటి యువకులు ఇద్దరు మృతి

image

కవిటి మండలం బెజ్జిపుట్టుగకు చెందిన రాజు, తొత్తిడిపుట్టుగకు చెందిన లక్ష్మణ్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో విషాదం నెలకొంది. ఒడిశా వివాహానికి వెళ్లి వస్తూ మంగళవారం రాత్రి చీకటిపేట వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో బైకుకు నిప్పు అంటుకోవడంతో లక్ష్మణ్ అక్కడికక్కడే మరణించాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా రాజు మృతి చెందాడు. ప్రమాదంలో గాయపడిన నరేంద్ర చికిత్స పొందుతున్నాడు.

Similar News

News January 11, 2026

శ్రీకాకుళం: ‘గుడ్డు ధర’ ఆల్ టైమ్ రికార్డ్

image

శ్రీకాకుళం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ఒక్క కోడిగుడ్డు ధర రూ.10 కి చేరింది. హోల్ సేల్ మార్కెట్లోనే ఒక్కో గుడ్డు రూ.9 పలుకుతోంది. గతంలో ఒక ట్రే (30 గుడ్లు) రూ.180- రూ.200 ఉండేవి. ప్రస్తుతం రూ.240- రూ.280కి చేరింది. ఇక నాటు కోడిగుడ్డు రూ.15-20 వరకు పలుకుతోంది. ఈ సీజన్లో ఎగ్స్ ఉత్పత్తి తగ్గి, డిమాండ్ పెరగటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు తెలిపారు.

News January 11, 2026

శ్రీకాకుళంలో 57 ఉద్యోగాల దరఖాస్తుకు నేడే లాస్ట్!

image

శ్రీకాకుళం జిల్లాలో కస్తూర్బా గాందీ బాలికల విద్యాలయాల్లో(KGVB) మొత్తం 57 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు నేటితో ముగియనుంది. ఈ క్రమంలో టైప్-3లో 30, టైప్-4 కేజీబీవీల్లో 27 పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ప్రభుత్వం భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు 18 ఏళ్ల వయసు కలిగినవారు మాత్రమే అప్లికేషన్లను జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.

News January 11, 2026

శ్రీకాకుళం: ప్రైవేటు ట్రావెల్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

image

సంక్రాంతి పండుగ వేళ ప్రైవేటు బస్సుల్లో ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉప రవాణా కమిషనర్‌ హెచ్చరించారు. జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు, యజమానులతో శనివారం ఆయన సమీక్షా నిర్వహించారు. సంక్రాంతి పండగ రద్దీని ఆసరాగా చేసుకుని అనధికారికంగా ఛార్జీలు పెంచి ప్రయాణికులకు భారం కలిగించవద్దని, బస్సులు ఫిట్నెస్ తప్పనిసరి అన్నారు.