News February 27, 2025

వరంగల్: విద్యార్థిని ఆత్మహత్య.. UPDATE

image

WGL నగరంలో ఉరేసుకొని బుధవారం <<15587387>>విద్యార్థిని ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన రేష్మిత WGL ములుగు రోడ్డులోని వ్యవసాయ విద్యాలయంలో ఫస్టియర్ చదువుతోంది. విద్యార్థినికి ఇంటిపై బెంగ ఉండటంతో అప్పుడప్పుడు తల్లి ఆమెతో పాటు హాస్టల్‌లో ఉండేందుకు యాజమాన్యం ఒప్పుకుంది. కాగా, నిన్న శివరాత్రి కావడంతో తోటి విద్యార్థులు సొంతూరు వెల్లగా ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

Similar News

News November 13, 2025

చింతపల్లిలో కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

image

చింతపల్లిలో గురువారం 12.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. బుధవారం 17 డిగ్రీలు నమోదు కాగా.. గురువారం 12 డిగ్రీలకు పడిపోయింది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో, ఉష్ణోగ్రతలు మరింతగా దిగజారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. చలి పులి పంజాకు ప్రజలు గజగజలాడుతున్నారు.

News November 13, 2025

గాంధారిలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. గాంధారిలో 10.8°C కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా మిగతా ప్రాంతాల్లో వివరాలు ఇలా ఉన్నాయి. బొమ్మన్ దేవిపల్లి 11, ఎల్పుగొండ,బీబీపేటలో 11.1, నస్రుల్లాబాద్,లచ్చపేటలో 11.2, రామారెడ్డి,రామలక్ష్మణపల్లిలో 11.4, సర్వాపూర్ 11.5, డోంగ్లి 11.6, మేనూర్ 11.8, ఇసాయిపేట,జుక్కల్‌లో 11.9, బీర్కూర్ 12°Cలుగా నమోదయ్యాయి.

News November 13, 2025

ALERT: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా?

image

ఢిల్లీ పేలుడులో ‘సెకండ్ హ్యాండ్ i20 కారు’ కీలకంగా మారింది. ఇలాంటి కేసుల్లో ఇరుక్కోకూడదంటే కొన్ని <<7354660>>జాగ్రత్తలు<<>> తీసుకోవాలి. కారు నంబర్‌పై కేసులు, ఛలాన్లతో పాటు ఫినాన్స్ పెండింగ్ ఉందేమో చూడాలి. ముఖ్యంగా అన్ని డాక్యూమెంట్లు ఉండాలి. ఆ వాహనం ఆధార్‌తో లింకై ఉండాలి. నేరుగా కాకుండా థర్డ్ పార్టీ ద్వారా కొంటే ఆ బాధ్యత వారిపైనా ఉంటుంది. కొన్నా, అమ్మినా RTOలో ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఓనర్‌షిప్ సర్టిఫికెట్ తప్పనిసరి.