News February 27, 2025

వరంగల్‌లో నల్గొండ విద్యార్థిని సూసైడ్

image

నల్గొండ రాక్ హిల్స్ కాలనీకి చెందిన విద్యార్థిని రేష్మిత వరంగల్‌లో ఉరేసుకొని బుధవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్ ములుగు రోడ్డులోని వ్యవసాయ కాలేజీలో రేష్మిత ఫస్టియర్ చదువుతోంది. ముభావంగా ఉండడంతో ఇటీవలే ఇంటికి తీసుకొచ్చి మళ్లీ కాలేజీకి పంపించారు. బుధవారం శివరాత్రి కావడంతో తోటి విద్యార్థులు సొంతూరు వెళ్లగా బుధవారం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

Similar News

News November 3, 2025

చిట్యాల అండర్‌పాస్ వద్ద సమస్య పరిష్కారానికి ఎస్పీ పర్యవేక్షణ

image

జాతీయ రహదారి 65 పై చిట్యాల రైల్వే బ్రిడ్జి అండర్‌పాస్ వద్ద వర్షపు నీరు నిలిచి తీవ్ర ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు.

News November 3, 2025

ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్‌

image

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆమె జిల్లా అధికారులను ఆదేశించారు.

News November 3, 2025

చెర్వుగట్టు ఆలయ అభివృద్ధిపై మంత్రి సురేఖ సమీక్ష

image

నల్గొండ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చెర్వుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయ మాస్టర్ ప్లాన్‌పై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తదితరులు పాల్గొన్నారు.