News February 27, 2025
ఎమ్మిగనూరులో చోరీ

ఎమ్మిగనూరులో భారీ చోరీ జరిగింది. బాధితుల వివరాల మేరకు.. తిరుమల నగర్‌కు చెందిన బాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న దొంగలు చోరీకి చొరబడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. పక్కింటి వారు సమాచారం ఇవ్వడంతో బాధితులు వెంటనే ఇంటికి చేరుకున్నారు. రూ.7లక్షల విలువైన బంగారం, రూ.40వేల నగదు ఎత్తుకెళ్లారని చెప్పారు.
Similar News
News January 18, 2026
HYDలో ఆదివారం AQ @189

HYDలో ఎయిర్ క్వాలిటీ గత వారంతో పోలిస్తే స్వల్పంగా మెరుగుపడింది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో నగరంలో కాలుష్యం పెరుగుతూ వస్తోంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్ క్వాలిటీ నగరంలో ఆదివారం తెల్లవారుజామున 189గా నమోదైంది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు మాస్కులు ధరించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వాహనాల రద్దీ, ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ తగ్గడంతో HYD ఊపిరితీసుకుంటోంది.
News January 18, 2026
4రోజుల్లో రూ.82కోట్లు కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. సంక్రాంతి కానుకగా ఈనెల 14న విడుదలై 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.82కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్టు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. ‘సంక్రాంతి రారాజు బాక్సాఫీస్ ధమాకా పేలుతూనే ఉంటుంది’ అని క్యాప్షన్ పెట్టింది. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మారి దర్శకత్వం వహించారు.
News January 18, 2026
గ్రేటర్ HYDలో 20న ఆటోల బంద్!

నగర వ్యాప్తంగా జనవరి 20న ఆటోల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు మహాత్మా గాంధీ ఆటో డ్రైవర్ల జేఏసీ కన్వీనర్ మహమ్మద్ తెలిపారు. ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు నిరసనగా, ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఆటో డ్రైవర్లతో భారీ ధర్నా చేపడతామని ప్రకటించారు. ప్రభుత్వమే స్పందించి తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆయన కోరారు.


