News February 27, 2025

HYD: ఉపాధ్యాయుడి వేధింపులు.. రిమాండ్

image

ప్రేమపేరుతో వేధిస్తున్న ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన ఆదిభట్ల PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. నాదర్‌గుల్‌లోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బాలికను ప్రేమపేరుతో వేధిస్తూ.. అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు ఆదిభట్ల PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి అతడిని రిమాండ్‌కు తరలించారు.

Similar News

News October 19, 2025

RTCలో డ్రైవర్, శ్రామిక్ పోస్టులు.. 9 రోజులే ఛాన్స్

image

TGSRTCలో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్టులకు 22-35 ఏళ్లు, శ్రామిక్ పోస్టులకు 18-30 ఏళ్ల వయసు ఉండాలి. SC, ST, BC, EWS కేటగిరీలకు 5 ఏళ్ల మినహాయింపు ఉంది. డ్రైవర్ పోస్టులకు పదో తరగతి పాసై ఉండాలి. హెవీ గూడ్స్ వెహికల్ లేదా హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. సైట్: <>www.tgprb.in/<<>>

News October 19, 2025

వేములవాడ: అదృశ్యమైన యువకుడి మృతదేహం లభ్యం

image

చందుర్తి మండలం జోగాపూర్‌కి చెందిన యువకుడు మట్టెల తిరుపతి మృతదేహం ఆదివారం సాయంత్రం లభ్యమైంది. గ్రామానికి చెందిన మట్టెల దేవయ్య- భాగ్యవల కుమారుడు తిరుపతి మతిస్థిమితం లేక ఇంటి వద్దనే ఉంటున్నాడు. సెప్టెంబర్ 29న గ్రామంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి అతడి కోసం వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం సాయంత్రం కిష్టంపేట శివారు బావిలో శవం దొరికింది.

News October 19, 2025

దీపావళి: దీపారాధనకు పాత ప్రమిదలను వాడొచ్చా?

image

పాత(లేదా) గతేడాది వాడిన మట్టి ప్రమిదలను ఈసారి కూడా వెలిగించడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ‘ప్రమిదలు దైవిక శక్తులతో పాటు ప్రతికూల శక్తులను కూడా గ్రహిస్తాయి. వాటిని తిరిగి వాడితే అది మన అదృష్టాన్ని, సంపదను ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీపావళి రోజున కొత్త ప్రమిదలను వాడటమే శ్రేయస్కరం. పాత ప్రమిదలను తులసి కోటళ్లో, గౌరవంగా పవిత్ర నదుల్లో, పవిత్ర చెట్ల మొదళ్లలో ఉంచడం మంచిది.