News February 27, 2025

రోడ్డు ప్రమాదంలో రాజమండ్రి వాసి మృతి 

image

కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా కొర్రపాటి నాగ మురళి శివప్రసాద్ (45) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో బుధవారం మృతి చెందాడు. దీంతో ఆయన నివాస ప్రాంతo అన్నపూర్ణమ్మ పేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆటో డ్రైవర్‌గా ఉన్న శివప్రసాద్ గత వారం కుంభమేళాకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బీహార్‌లోని గయలో రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నేడు రాజమండ్రికి ఆయన భౌతికకాయం రానుంది.

Similar News

News February 18, 2026

RJY: టెన్త్ పరీక్షలు రాయబోతున్నారా? ఈ వివరాలు మీ కోసమే!

image

మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే టెన్త్ పరీక్షలకు 24,538 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు డీఈవో కె. వాసుదేవరావు ప్రకటించారు. అందులో 12,555 మంది బాలురు, 11,983 మంది బాలికలు పరీక్షలకు సన్నద్ధంగా ఉన్నారన్నారు. టెన్త్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

News February 17, 2026

రాజమండ్రి: టెన్త్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలి- డీఆర్ఓ

image

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై మంగళవారం బొమ్మూరులోని జిల్లా కలెక్టరేట్‌లో పబ్లిక్ పరీక్షలపై సమన్వయ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని డీఆర్ఓ టి. సీతారామ మూర్తి దిశానిర్దేశం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్, శానిటేషన్, భద్రతా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని డిఆర్ఓ సూచించారు.

News February 17, 2026

వికసిత్ భారత్‌కు బడ్జెట్-2026 బలమైన పునాది: పురందేశ్వరి

image

2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కేంద్ర బడ్జెట్-2026 దీర్ఘకాలిక పునాది వేస్తుందని ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. మంగళవారం రాజమండ్రిలో నిర్వహించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో జరుగుతున్న దేశాభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.