News February 27, 2025
బాపట్ల జిల్లాలో వారికి మాత్రమే సెలవు

ఇవాళ ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా బాపట్ల జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు గురువారం సెలవు ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్ వెంకట మురళి ప్రకటన చేశారు. ఈ సెలవు కేవలం బాపట్ల, వేమూరు, రేపల్లె నియోజకవర్గ పరిధిలోని మండలాలకే వర్తిస్తుంది. చీరాల, అద్దంకి, పర్చూరు పరిధిలో స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా నడుస్తాయి.
Similar News
News January 2, 2026
వినుత హత్యకు MLA సుధీర్ డైరెక్షన్‌లో ప్లాన్: YCP

రాయుడు హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంది. చెన్నై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. వినుత దంపతుల హత్యకు శ్రీకాళహస్తి MLA సుధీర్ రెడ్డి డైరెక్షన్‌లో TDP కార్యకర్త సుజిత్ రెడ్డితో కలిసి రాయుడు ప్లాన్ చేశాడని YCP ‘X’ వేదికగా ఆరోపించింది. ఇందు కోసం రూ.30 లక్షల డీల్ జరిగిందని, జనసేన కార్యకర్త పేట చంద్రశేఖర్ సోదరులు సహకరించారని రాసుకొచ్చింది. ఇప్పటికే సుధీర్‌కు నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది.
News January 2, 2026
లొంగిపోయిన దేవా

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కీలక నేత బర్సే దేవా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మరో 15 మంది మావోలతో కలిసి ఆయన సరెండర్ అయ్యారు. దేవాపై రూ.50లక్షల రివార్డ్ ఉంది. ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించిన అగ్రనేత హిడ్మాతో కలిసి దేవా 15 ఏళ్లు పనిచేశారు. వీరిద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు.
News January 2, 2026
ట్రాలీలు.. పబ్లిక్ టాయ్‌లెట్ల కంటే ఘోరం

సూపర్ మార్కెట్ల Cart/ట్రాలీ హ్యాండిల్స్‌పై పబ్లిక్ టాయ్‌లెట్ల కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని ఓ సర్వేలో వెల్లడైంది. E.కోలి సహా పలు ప్రమాదకర బ్యాక్టీరియాలు వాటిపై కన్పించాయట. అలాంటి వాటిపై పిల్లలను కూర్చోబెట్టడం అనారోగ్యకరమని పరిశోధకులు హెచ్చరించారు. సూపర్ మార్కెట్లకు సొంత బ్యాగ్స్ తీసుకెళ్లడం బెటర్ అని సూచించారు. ట్రాలీ పట్టుకోవడం తప్పనిసరైతే శానిటైజర్ వంటివి స్ప్రే చేసి వాడాలన్నారు.
Share It


