News February 27, 2025

HYD: అయ్యో ఎంత పనిచేశారు సారూ..!

image

పండగపూట లంగర్‌హౌస్ చెరువులో <<15590306>>తండ్రీ కొడుకులు<<>> మృతిచెందిన విషయం తెలిసిందే. వారు చనిపోవడానికి ముందు జరిగిన పరిణామాలు స్థానికులు చెబుతుంటే కలవరపెడుతున్నాయి. కొడుకును భుజాన ఎత్తుకుని మునిగిపోతూ అధికారులు, సిబ్బందిని రక్షించమని వేడుకున్నా.. వారు స్పందించకుండా సాయం కావాలని స్థానిక నాయకులకు ఫోన్ చేసి అడిగారని ప్రత్యక్షసాక్షులు వాపోయారు. వారు సాయం అందించుంటే ఇద్దరూ బతికుండేవారని బాధిత కుటుంబం రోదించింది.

Similar News

News February 27, 2025

మహా నగరంలో.. మహా శివరాత్రి ఎఫెక్ట్

image

ట్రాఫిక్ జామ్‌లతో నిండిపోయే మహానగరపు రోడ్లు ఇవాళ కాస్త ఖాళీగా కనిపించాయి. మహా శివరాత్రిని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో జాగరణలో గడిపారు. ఈ ఎఫెక్ట్‌తో ఉదయం లేట్‌గా రోడ్లపైకి వస్తుండటంతో 11 తర్వాత వాహనాలు పెరిగాయి. JNTU, మియాపూర్, బాచుపల్లి, మాదాపూర్, సికింద్రాబాద్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, ABIDS, DSNR వంటి బిజీరోడ్లపై ఇప్పుడిప్పుడే హారన్‌మోతలు పెరిగాయి. మీప్రాంతంలో రద్దీగా ఉందా? కామెంట్ చేయండి.

News February 27, 2025

మన HYD కోసం పీఎం మోదీ వద్దకు సీఎం రేవంత్!

image

ప్రధాని మోదీ భేటీలో HYD అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలను పీఎం ముందుంచారు. ✔️నగరంలో మెట్రో రైల్ ఫేజ్‌-IIకు అనుమ‌తించాలి.✔️ మూసీ పునరుజ్జీవం కోసం కేంద్రం సాయం చేయాలి.✔️ తెలంగాణలో ఒక డ్రైపోర్టు నిర్మించాలి. ✔️ RRR ప్రాజెక్టుకు అనుమతులు, ఆమోదం ఇవ్వాలి.✔️ మూసీ, గోదావరి అనుసంధానం కోసం రూ.2,000 కోట్లు కావాలి.

News February 27, 2025

HYD: శివయ్యా.. కడుపు నింపావయ్యా..!

image

నిన్న మహా శివరాత్రిని పురస్కరించుకుని HYD శివనామస్మరణతో తరించింది. త్రేతాయుగంలో వానర సేన హనుమ, శ్రీ రాముడు ప్రతిష్ఠించిన కీసరలోని శివలింగం వద్ద అద్భుతం జరిగింది. భోళాశంకరుడికి భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని తిన్న వానరాలు.. వాటి కడుపునింపినందుకు ధన్యవాదాలు తెలుపుతూ శివయ్యను మొక్కుతున్నట్లు ఉన్న ఈ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. వాటి సేనాని, ఆరాధ్య దైవం ప్రతిష్ఠించిన లింగం వద్ద సందడి చేశాయి.

error: Content is protected !!