News February 27, 2025
పార్వతీపురం జిల్లాలో మొదలైన ఓటింగ్

పార్వతీపురం మన్యం జిల్లాలో ఉదయం 8 గంటల నుంచి టీచర్ MLC ఎన్నిక పోలింగ్ మొదలైంది. జిల్లాలో 2,333 మంది టీచర్లు ఇవాళ ఓటు వేసే అవకాశం ఉంది. ఇందులో 1,574 మంది పురుషులు, 759 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పార్వతీపురం మండలంలో ఎక్కువగా 636 మంది, పాచిపెంటలో తక్కువగా 34 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటింగ్ జరిగే ఏరియాలో 144 సెక్షన్ అమలు చేస్తూ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Similar News
News September 14, 2025
పెదాలు అందంగా ఉండాలంటే

పెదాలు అందంగా, తాజాగా ఉండాలంటే మీ స్కిన్‌కేర్‌లో లిప్ఆయిల్ యాడ్ చేసుకోవాల్సిందే. ఇది చూడటానికి లిప్‌గ్లాస్‌లా ఉంటుంది. దీనిలోని మాయిశ్చరైజింగ్ గుణాలు పెదాలు పగలకుండా చూస్తాయి. వీటిని లిప్‌స్టిక్‌కి జత చేస్తే పెదాలు ఎక్స్‌ట్రా షైనీగా ఉంటాయి. లిప్‌ఆయిల్స్‌లో ఉండే విటమిన్స్, ఫ్యాటీయాసిడ్స్ లిప్‌బామ్ కంటే ఎక్కువ హైడ్రేషన్ ఇస్తాయి. వీటిలో కూడా SPF ఉండేవి వాడితే యూవీ కిరణాల నుంచి పెదాలని రక్షిస్తాయి.
News September 14, 2025
జానంపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మూసాపేట మండలంలోని జానంపేటలో 51.5 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. బాలానగర్ 50.5, భూత్పూర్ 12.8, మహబూబ్ నగర్ గ్రామీణం 12.3, దేవరకద్ర 11.8, రాజాపూర్ 7.8, నవాబుపేట 6.8, హన్వాడ 6.3, జడ్చర్ల 5.0 మిల్లీ మీటర్లు వర్షం పడింది.
News September 14, 2025
MBNR: జాతీయ లోక్ అదాలత్..2,597 కేసులు పరిష్కారం

జాతీయ మెగా లోక్ అదాలత్‌లో మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 2,597 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ఎస్పీ డి.జానకి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. 15 రోజులుగా పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది కేసుల్లో ఉన్న కక్షిదారులను స్వయంగా కలిసినందువల్ల రాజీ మార్గం అవగాహన కలిగించి, లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలకూ ‘మీ ఇంటికే సత్వర న్యాయం’ జరిగిందని, మానిటరింగ్ చేసిన చేసినవారికి త్వరలో రివార్డు అందజేస్తామన్నారు.