News March 22, 2024
MBNR: ‘తెలంగాణలో దోపిడి పాలన పోయి ప్రజల పాలన వచ్చింది’

రాష్ట్రంలో దోపిడీ పాలన పోయి ప్రజల పాలన వచ్చిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కేంద్రానికి చెందిన పలువురు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్ తదితరులు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News September 6, 2025
జడ్చర్లలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

జడ్చర్ల పట్టణంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఎంబీ చర్చ్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న ప్రమోద్(25) అక్కడికక్కడే మరణించాడు. మరో యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 6, 2025
పాలమూరులో మైక్రో బ్రూవరీలకు అనుమతి

MBNR జిల్లాలో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. వెయ్యి గజాల స్థలంలో వీటిని ఏర్పాటు చేసుకోవాలని, తయారైన బీర్లను అక్కడే విక్రయించాలని సూచించారు. 36 గంటల్లోగా అమ్ముడుపోని బీర్లను పారేయాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. అనుమతి పొందిన వారు ఆరు నెలల్లోగా యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు.
News September 6, 2025
జడ్చర్ల ప్రజలు సుభిక్షంగా ఉండాలి: MP

నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం విహెచ్పీ ఆధ్వర్యంలో నేతాజీ చౌక్ లో జరుగుతున్న వినాయక నిమజ్జనోత్సవంలో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. అనంతరం శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ తీమ్ తో ఏర్పాటుచేసిన గణపతి మండపాన్ని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న ఎంపీ ప్రజలందరిపై గణపయ్య ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.