News February 27, 2025
‘తెలుగు’కు దక్కిన గౌరవం

పక్క రాష్ట్రాలకు వెళ్లినప్పుడు మనకు అక్కడి భాషల్లోనే నేమ్ బోర్డులు కనిపిస్తుంటాయి. కానీ, కుంభమేళాలో భాగంగా UPలోని చాలా ప్రాంతాల్లో తెలుగు బోర్డులు దర్శనం ఇచ్చాయి. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే మార్గాల్లో, త్రివేణీ సంగమం వద్ద, కాశీలోనూ UP ప్రభుత్వం తెలుగుభాషలో బోర్డులు ఏర్పాటు చేసింది. దీంతో AP, తెలంగాణ నుంచి వెళ్లిన భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలుగు భాషకు దక్కిన గౌరవం అని పలువురు గర్వపడ్డారు.
Similar News
News February 27, 2025
Breaking: వక్ఫ్ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

JPC రిపోర్టు ఆధారంగా సవరించిన వక్ఫ్ బిల్లును కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. మార్చి 10 నుంచి మొదలయ్యే బడ్జెట్ రెండో దఫా సమావేశాల్లో లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. సాధారణ ఓటింగుతో ఉభయ సభల్లో ఆమోదం పొంది, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజముద్ర వేస్తే కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. వక్ఫ్ బిల్లును కాంగ్రెస్ సహా ఇండియా కూటమి నేతలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
News February 27, 2025
చిట్టీల పేరుతో చీటింగ్.. రూ.100కోట్లతో జంప్!

HYDలో ఓ చిట్టీల వ్యాపారి సుమారు 2వేల మందికి డబ్బులు చెల్లించకుండా ఫ్యామిలీతో పరారయ్యాడు. అనంతపురం జిల్లాకి చెందిన పుల్లయ్య 18yrs క్రితం HYD వచ్చాడు. కూలీ పనులు చేసే అతను చిట్టీల వ్యాపారంతో కోటీశ్వరుడయ్యాడు. బీకేగూడ రవీంద్రానగర్‌లో ఉంటూ స్థానికులతో చిట్టీలు వేయించాడు. డబ్బులు తిరిగి చెల్లించాలని అడగడంతో ఈనెల 21న పరారయ్యాడు. బాధితులంతా అతని ఇంటికి చేరుకొని ఆవేదన వ్యక్తం చేయడంతో విషయం వెలుగుచూసింది.
News February 27, 2025
ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం: KTR

TG: సినీ నిర్మాత కేదార్ మరణం గురించి సీఎం రేవంత్ చేసిన <<15587966>>వ్యాఖ్యలపై<<>> బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘హత్యలు, మరణాలు అంటూ అనవసర ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలో ఉండి ప్రతిపక్షంలా మాట్లాడుతున్నారు. తాను ఏం చెప్పినా జనాలు నమ్ముతారని అనుకోవడం పొరపాటే. ప్రభుత్వం ఆయన చేతిలోనే ఉంది. ఎలాంటి విచారణకైనా సిద్ధం’ అని స్పష్టం చేశారు.