News February 27, 2025
రాముడిలానే కాదు.. కొన్నిసార్లు శివుడిలా ఉండాలి: మంత్రి లోకేశ్

AP: శివుడిని తలచుకున్నా, ఆయన విగ్రహం చూసినా తనకు ఎంతో బలం వస్తుందని మంత్రి లోకేశ్ తెలిపారు. శివరాత్రి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘బాబు గారి అరెస్ట్ తర్వాత నా ఆలోచన విధానం మారింది. శివుడిపై భక్తి చాలా పెరిగింది. రాముడిలానే కాదు.. కొన్నిసార్లు శివుడిలా ఉండాలనే నమ్మకం కలిగింది. నా యువగళం పాదయాత్రలో స్వయంగా శివుడే నన్ను నడిపించాడు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News February 27, 2025
జూ పార్క్ టికెట్ ధరలు భారీగా పెంపు

TG: హైదరాబాద్ నెహ్రూ జూపార్కులో వివిధ టికెట్ ధరలను భారీగా పెంచారు. ఇప్పటివరకు ఎంట్రన్స్ టికెట్ పెద్దలకు రూ.75, పిల్లలకు రూ.45 ఉండగా.. ఇక నుంచి రూ.100, రూ.50 వసూలు చేస్తామని అధికారులు ప్రకటించారు. ట్రైన్ రైడ్ టికెట్ పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.40గా నిర్ణయించారు. బ్యాటరీ వెహికల్ రైడ్ ధర రూ.120 అని తెలిపారు. అలాగే పార్కింగ్ ధరలు సైతం పెంచారు. మార్చి 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయన్నారు.
News February 27, 2025
Breaking: వక్ఫ్ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

JPC రిపోర్టు ఆధారంగా సవరించిన వక్ఫ్ బిల్లును కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. మార్చి 10 నుంచి మొదలయ్యే బడ్జెట్ రెండో దఫా సమావేశాల్లో లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. సాధారణ ఓటింగుతో ఉభయ సభల్లో ఆమోదం పొంది, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజముద్ర వేస్తే కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. వక్ఫ్ బిల్లును కాంగ్రెస్ సహా ఇండియా కూటమి నేతలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
News February 27, 2025
చిట్టీల పేరుతో చీటింగ్.. రూ.100కోట్లతో జంప్!

HYDలో ఓ చిట్టీల వ్యాపారి సుమారు 2వేల మందికి డబ్బులు చెల్లించకుండా ఫ్యామిలీతో పరారయ్యాడు. అనంతపురం జిల్లాకి చెందిన పుల్లయ్య 18yrs క్రితం HYD వచ్చాడు. కూలీ పనులు చేసే అతను చిట్టీల వ్యాపారంతో కోటీశ్వరుడయ్యాడు. బీకేగూడ రవీంద్రానగర్‌లో ఉంటూ స్థానికులతో చిట్టీలు వేయించాడు. డబ్బులు తిరిగి చెల్లించాలని అడగడంతో ఈనెల 21న పరారయ్యాడు. బాధితులంతా అతని ఇంటికి చేరుకొని ఆవేదన వ్యక్తం చేయడంతో విషయం వెలుగుచూసింది.