News February 27, 2025
గుంటూరులో యాక్సిడెంట్ ఇద్దరు దుర్మరణం.!

కాకానిరోడ్డులోని వాసవీ మార్కెట్ వద్ద మూడు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎన్టీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన సి.హెచ్ వెంకటేశ్ (15), లాలాపేట ప్రాంతానికి చెందిన అలీ (28) ఈ ప్రమాదంలో మరణించారు. మరో యువకుడు గాయపడినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈస్ట్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 27, 2025
రేవేంద్రపాడులో భార్యాభర్తల అనుమానాస్పద మృతి

దుగ్గిరాల (M) రేవేంద్రపాడులో అనుమానాస్పద స్థితిలో భార్యాభర్తలు మృతిచెందారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి సురేశ్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య శ్రావణి మృతదేహం కూడా పక్కనే పడి ఉంది. కొద్ది రోజులుగా వీరి మధ్య గొడవ జరుతున్నట్లు స్థానికులు తెలిపారు. మంగళవారం రాత్రి వీరి మధ్య ఘర్షణ చెలరేగినట్లు తెలుస్తోంది. బుధవారం ఇంట్లో విగత జీవులుగా ఉన్న ఇద్దరిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
News February 27, 2025
తాడేపల్లి: చేనేత వస్త్రంపై లోకేశ్ కుటుంబ చిత్రం

మంగళగిరికి చెందిన తెలుగుదేశం పార్టీ అభిమాని జంజనం మల్లేశ్వరరావు, ఆయన కుమారుడు కార్తికేయ బుధవారం ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లోకేశ్ కుటుంబ సభ్యుల చిత్రాలతో నేత నేసిన చేనేత వస్త్రాన్ని మంత్రికి బహుకరించారు. లోకేశ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు వారు ఆసక్తి చూపడం అభినందనీయని, వారికి పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు.
News February 27, 2025
గుంటూరు: ఎమ్మెల్సీ ఎలక్షన్‌కు సర్వం సిద్ధం

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 149 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 1,08,109మంది ఓటర్లు ఓటు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు. వీరిలో పురుషులు 62,549, మహిళలు 45,542, ఇతరులు 18మంది ఉన్నారు. గ్రాడ్యుయేట్లు అందరూ తప్పనిసరిగా ఓటు హక్కును ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.